Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

తైక్వాండో లో గిన్నిస్ రికార్డు సృష్టించిన వెల్దండ వాసి..!

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలానికి చెందిన ఎండి జాంగిర్ హైదరాబాదులో బ్లాక్ బెల్ట్ మూడవ డాన్ ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రదర్శనలో పాల్గొని ప్రతిభ చూపించారు.

తైక్వాండో లో గిన్నిస్ రికార్డు సృష్టించిన వెల్దండ వాసి..!

వెల్దండ, మన సాక్షి :

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలానికి చెందిన ఎండి జాంగిర్ హైదరాబాదులో బ్లాక్ బెల్ట్ మూడవ డాన్ ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రదర్శనలో పాల్గొని ప్రతిభ చూపించారు. తైక్వాండో క్రీడారంగంలో నిమిషాల పాటు 533 మంది క్రీడాకారుల ప్రదర్శన, 2 వేల నుంచి 3 వేల జంపింగ్ కిక్స్ తో పాటు వివిధ రకాల పంచులు, బ్లాకులు ప్రదర్శించి సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ప్రపంచ స్థాయిలో నిలిచిపోయేలా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన వారిలో జాంగిర్ ఉత్తమ ప్రతిభ కనబరచాడని, గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంజేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ సుమన్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తైక్వాండో పోటీల్లో వరల్డ్ రికార్డు సాధించారని గ్రౌండ్ మాస్టర్ జయంత్ రెడ్డి తెలిపారు. వరల్డ్ రికార్డు సాధించిన ఎండి జాంగిర్ ను ఎండి ఖలీల్ మాస్టర్, కుమార్ మాస్టర్ లు అభినందించారు.

మరిన్ని వార్తలు