Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

Ration Cards : రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కొత్త పథకానికి ఆమోదం..!

ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా నిర్వహించడంతో పాటు అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం నూతన పథకాన్ని తీసుకురాబోతుంది.

Ration Cards : రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కొత్త పథకానికి ఆమోదం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా నిర్వహించడంతో పాటు అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం నూతన పథకాన్ని తీసుకురాబోతుంది. దేశవ్యాప్తంగా సుమారుగా 81.35 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. సార్ధక్ పి డి ఎస్ అనే నూతన పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా రేషన్ పంపిణీ రియల్ టైంలో పర్యవేక్షించనున్నారు.

కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ పథకం యొక్క వివరాలను వెల్లడించారు. రేషన్ బియ్యం మరియు ఇతర ఆహార ధాన్యాలు పక్కదారి పట్టకుండా చూడడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. దీనిని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 25,530 కోట్ల రూపాయలు ప్రకటించింది. రాబోయే ఐదేళ్లపాటు ఈ నిధులు పంపిణీ వ్యవస్థను ఆధునీకరింపజేయడానికి ఉపయోగిస్తారు.

మానిటరింగ్, బయోమెట్రిక్ ధ్రువీకరణ :

గోదాముల నుండి చౌక ధరల దుకాణాల వరకు సరుకులు ఎలా వెళ్తాయి. ఎంతమందికి పంపిణీ అయిందనే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో పర్యవేక్షిస్తారు. అందుకుగాను ప్రత్యేకమైన అప్లికేషన్ తీసుకురానున్నారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ సరుకులు అందేలా ఆధార్ లేదా బయోమెట్రిక్ ధ్రువీకరణను మరింత బలోపేతం చేయనున్నారు. ఈ పథకం వల్ల నకిలీ కార్డులకు చెక్ పడనున్నది.

కొత్త దరఖాస్తుల ప్రక్రియ ఈజీ :

రేషన్ సరుకుల రవాణా, గిడ్డంగుల నిర్వహణ, డీలర్ల మార్జిన్, ఇతర ఖర్చులను ఈ పథక ద్వారానే కేంద్రం భరిస్తుంది. దీని ద్వారా రాష్ట్రాలపై ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. దీని ద్వారా లబ్ధిదారులకు సరైన సమయంలో ఆహార ధాన్యాలు కూడా అందుతాయి. రేషన్ కార్డుల నిర్వహణ కొత్త దరఖాస్తుల ప్రక్రియ కూడా ఇకపై ఈజీ కానున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంతో సామాన్యులకు ఎంతో ఊరట కలిగించే అంశం కానున్నది.

అక్రమ రేషన్ కార్డుదారులకు చెక్ :

రేషన్ సరుకుల విషయంలో అర్హులైన లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా అక్రమ రేషన్ కార్డుదారులకు చెక్ పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం సార్ధక్ పిడిఎఫ్ పథకాన్ని తీసుకురానున్నది. అయితే ఈ పథకం సామాన్యులకు ఏమేరకు మేలు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు