Narayanpet : నారాయణపేట లో ఉద్రిక్తత.. పేట బంద్ విజయవంతం..!
నారాయణపేట జిల్లా కేంద్రం సోమవారం ధర్నాలు, పట్టణ బంద్ తో అట్టుడికి పోయింది. ఆదివారం 11 గంటల యాభై నిమిషాలకు స్థానిక కురువ గేరి వీధిలో నివసిస్తున్న మైనర్ బాలిక వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అశ్విని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకోవడం జరిగింది.

Narayanpet : నారాయణపేట లో ఉద్రిక్తత.. పేట బంద్ విజయవంతం..!
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి
హిందూ సంఘాల డిమాండ్
భారీ పోలీసు బందోబస్తు.
నారాయణపేటటౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా కేంద్రం సోమవారం ధర్నాలు, పట్టణ బంద్ తో అట్టుడికి పోయింది. ఆదివారం 11 గంటల యాభై నిమిషాలకు స్థానిక కురువ గేరి వీధిలో నివసిస్తున్న మైనర్ బాలిక వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అశ్విని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే గత కొంతకాలంగా మైనర్ బాలి కను ప్రేమ పేరుతో లోభర్చుకొని తీవ్ర వేధింపులకు గురి చేస్తూ, లవ్ జిహాద్ పేరుతో అనేకసార్లు కామ వాంఛ తీర్చుకుంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేయడంతో పాటు మతం మార్చుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో అమ్మాయి తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అదే రోజు నిందితుడిని కర్ణాటక రాష్ట్రం యాదగిరి లో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే కేసు నమోదు చేశారు. అమ్మాయి మృతదేహా నికి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్తూ పాత బస్టాండ్ దగ్గర వీర సవర్కర్ చౌరస్తా లో ధర్నా నిర్వహిస్తూ పెద్ద ఎత్తున వాల్మీకి నాయకులు, హిందూ సంఘాలు నినాదా లు చేశారు. పోలీసులు వచ్చి అమ్మాయి కుటుంబ సభ్యుల కు న్యాయం చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. ఆ తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు.
నిదితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నారాయణపేట బంద్ కు వాల్మీకి సంఘం, హిందూ సంఘాలు పిలుపు నివ్వ డంతో స్వచ్ఛందంగా జిల్లా కేంద్రంలో వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు సంపూర్ణ బంద్ పాటించడం జరిగింది.
బస్ డిపో వద్ద ఉద్రిక్తత ::
బాలిక కుటుంబానికి న్యాయంచేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించి న బంద్ లో భాగంగాహిందూ సంఘాల నాయకులు,బిజెపి నాయకులు,వాల్మీకి సంఘం నాయకులు ఆర్టీసీ బస్సులు కదలకుండా డిపో ముందు బైఠాయించారు. దాంతో పోలీ సులు బస్సులను వదిలేందు కు ప్రయత్నించడంతో వాగ్వా దం జరిగింది. దాంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఎట్టకేలకు బిజెపి రాష్ట్ర సీనియర్ నేత రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామాజీ తో పాటు,కౌన్సిలర్ల ,హిందూ సంఘాల నాయకులు, వాల్మీకి సంఘం నాయకుల ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో యధావిధిగా మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సులు నడిచాయి.
బంద్ విజయవంతం :
మైనర్ బాలిక ఆత్మహత్యకు కారకుడైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని,బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం హిందూ సంఘాలు వి ఎచ్ పి,భజరంగ్ దల్,వాల్మీకి సంఘం,బిజెపి ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నారాయ ణపేట బంద్ విజయవంతం అయింది. ఈ బంద్ తో వ్యాపార కేంద్రాలు, విద్యా సంస్థలు,బ్యాంకులు,హోటళ్ళు,పాన్ డబ్బాలు సైతం స్వచ్ఛందంగా మూసివేసి బంద్ కు మద్దతు పలకడంతో బంద్ విజయవంతం అయింది. బంద్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.బంద్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.











