Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేటలో జైలు భరో.. నేతల అరెస్టు..!

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన జైలు భరో కార్యక్రమం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Suryapet : సూర్యాపేటలో జైలు భరో.. నేతల అరెస్టు..!

సూర్యాపేట, మనసాక్షి :

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన జైలు భరో కార్యక్రమం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివిధ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించగా పోలీసులు అడ్డుకుని నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు.

సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన భారీ ప్రదర్శనలో తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం, సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, ప్రగతిశీల మహిళా సంఘం, రైతాంగ సమితి, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రదర్శన ముందుకు సాగకుండా పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. దీంతో ప్రజా సంఘాల నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సూర్యాపేట డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందితో నాయకులు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు దురుసుగా వ్యవహరించారని, అసభ్య పదజాలం ఉపయోగించారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు.

మహిళా నాయకులను సైతం పోలీసులు చూడకుండా అరెస్టు చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. మహిళా నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులకు, మహిళా నాయకులకు మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొంతసేపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిమల్లు లక్ష్మి, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు మండారి డేవిడ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంబాలపల్లి శ్రీను మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు.

ప్రజల హక్కుల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఎన్ని నిర్బంధాలు విధించినా అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కార్మికులకు న్యాయం జరిగే వరకు ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.

ముందస్తు అరెస్టులు. : 

జైలు బరో నేపథ్యంలో పోలీసులు ఉదయం తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి, బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకి రెడ్డి ని అరెస్ట్ చేశారు.

పలువురు నాయకులు అరెస్టు, విడుదల : 

దేశవ్యాప్తంగా జరుగుతున్న జైల్ బరో కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారికి చేరుకున్న ప్రజాసంఘాల నాయకులను నిరసన కారులను అరెస్టు చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించిన అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, ఐ ఎన్ టీ యి సి నాయకులు బాలకృష్ణ,వివిధ ప్రజా సంఘాల నాయకులు నెమ్మది వెంకటేశ్వర్లు, మేకల శ్రీను, గంట నాగయ్య, మట్టి పెళ్లి సైదులు, కొప్పోజు సూర్యనారాయణ,పేర్ల నాగయ్య, బొడ్డు శంకర్, పి లక్ష్మయ్య,దండ వెంకటరెడ్డి, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, కునుకుంట్ల సైదులు,

కొత్తపల్లి రేణుక,బూర వెంకటేశ్వర్లు, ఎర్ర అఖిల్,పోలేబోయిన కిరణ్, ధనియాకుల శ్రీకాంత్, సింహాద్రి,మద్దెల జ్యోతి, ఆవుల నాగరాజు, వీరబోయిన రవి, జంపాల స్వరాజ్యం, ఉదయగిరి, దశరథ, ఎల్గూరి గోవింద్, మేకనబోయిన శేఖర్, నల్లగొండ నాగయ్య, కంచర్ల నర్సక్క, మేకనబోయిన సైదమ్మ, బొలిశెట్టి భాస్కరమ్మ,అలుగుబెల్లి వెంకటరెడ్డి,

బుల్లె వెంకన్న, జడ శ్రీను, దంతాల రాంబాబు, శ్యామల అశోక్, వేల్పుల వెంకన్న, మడ్డి అంజిబాబు ఖమ్మం పాటి రాము, ఆవిరి అప్పయ్య, పిండిగా నాగమణి, గుంజ వెంకటేశ్వర్లు, చిట్లింకి యాదగిరి, మేరెడ్డి కృష్ణారెడ్డి, నల్లెడ మాధవరెడ్డి, బాలస్వామి, ఉప్పుల రమేష్, శివ కృష్ణ, చిత్రం భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు