వైభవంగా గణేష్ నిమజ్జనం వేడుకలు..!
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా ముగిశాయి. శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణేష్ నిమజ్జన వేడుకలు బుధవారం కమనీయంగా సాగాయి.

వైభవంగా గణేష్ నిమజ్జనం వేడుకలు..!
– వేలం పాటలో రూ.13,116 లకు లడ్డు కైవసం
వేములపల్లి, మన సాక్షి :
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా ముగిశాయి. శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణేష్ నిమజ్జన వేడుకలు బుధవారం కమనీయంగా సాగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మంగళ వాయిద్యాలు, భజన కార్యక్రమాలతో గ్రామం మారుమోగింది.
భక్తులు స్వామివారి కీర్తనలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా సాగారు. నిమజ్జన ఊరేగింపునకు ముందు శ్రీ విజ్ఞేశ్వర ఉత్సవ కమిటీ నిర్వహించిన వినాయక లడ్డు వేలం పాట గ్రామస్తుల మధ్య హోరాహోరీగా కొనసాగింది.ఈ వేలంలో గ్రామానికి శీలం వెంకన్న- జ్యోతి దంపతులు 13,116 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు. అదేవిధంగా స్వామి వారి కలిశాన్ని గ్రామానికి చెందిన శీలం వీరభద్రి-లక్ష్మి దంపతులు 3500 రూపాయలతో వేలం పాట పాడి కైవసం చేసుకున్నారు.
Also Read : తడ్కల్ రూ.30వేలు పలికిన గణేశుడి లడ్డూ..!
భక్తులు గణపతి పప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు.అనంతరం భక్తులు వేదమంత్రాల నడుమ గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలుకుతూ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Also Read : ధైర్యపురి తండ లడ్డు వేలం పాట రూ.1.26 లక్షలు.. దక్కించుకున్న సర్పంచ్. వాంకుడవత్ అనిత దాస్..!









