Breaking Newsజిల్లా వార్తలుపండుగలుసంగారెడ్డి జిల్లా
తడ్కల్ రూ.30వేలు పలికిన గణేశుడి లడ్డూ..!
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో శ్రీరామ్ కాలనీ మండలి ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.

తడ్కల్ రూ.30వేలు పలికిన గణేశుడి లడ్డూ..!
కంగ్టి, మన సాక్షి :-
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో శ్రీరామ్ కాలనీ మండలి ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా గుట్టలేశ్వర మందిర్ ఆవరణలో గణేష్ లడ్డూ ప్రసాదానికి వేలం నిర్వహించగా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేలం పాటలో రెడ్డి గోపాల్ రూ. 30 వేలకులడ్డూను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా మండలి సభ్యులు, భక్తులు రెడ్డి గోపాల్ ను అభినందించారు.తడ్కల్ లో అదిదేవ్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేష్ లడ్డూ దారం రాములు సెట్ రూ.16 వేలకు దక్కిస్తున్నారు. అనంతరం మండలి సభ్యులు ఆయనను అందజేశారు. వేలంపాట అనంతరం పెద్ద చెరువులో గణపతి లను నిమర్జనం చేశారు.ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










