WhatsApp : వాట్సాప్ లో స్పామ్ కాల్స్ వస్తున్నాయా, ఇలా చెక్ పెట్టండి..వెరీ సింపుల్ సెట్టింగ్స్..!
స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో కనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సప్ వినియోగిస్తున్నారు. ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో పాటు ఆడియో కాల్స్ వీడియో కాల్స్ కు ఎక్కువగా వాట్సప్ ని వినియోగిస్తున్నారు.

WhatsApp : వాట్సాప్ లో స్పామ్ కాల్స్ వస్తున్నాయా, ఇలా చెక్ పెట్టండి..వెరీ సింపుల్ సెట్టింగ్స్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో కనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సప్ వినియోగిస్తున్నారు. ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో పాటు ఆడియో కాల్స్ వీడియో కాల్స్ కు ఎక్కువగా వాట్సప్ ని వినియోగిస్తున్నారు. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఎక్కువగా వాట్సాప్ ను వినియోగించి ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో పాటు సంభాషణలు చేస్తున్నారు. కాగా నిత్య జీవితంలో వాట్స్అప్ ఒక భాగమైంది.
అదేవిధంగా స్కామర్లు కూడా వాట్సప్ హ్యాక్ చేయడం, ఇంకా గుర్తుతెలియని నెంబర్ నుంచి ఫోన్లు చేయడం చేస్తున్నారు. దాంతో సైబర్ నేరాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాటి నుంచి వినియోగదారుల భద్రతకు వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకువచ్చింది.
ఆ ఫీచర్ తో ఇకపై కాంటాక్ట్ లో ఉన్న నెంబర్లు మినహా కొత్త నెంబర్‌తో ఫోన్ పోస్తే సైలెంట్ మోడ్ లోకి వెళ్లి పోతుంది. స్పామ్ కాల్స్ ఇక మనకు రావు. కేవలం మిస్ కాల్ మాత్రమే కనిపిస్తుంది. వాట్స్అప్ ద్వారా వచ్చే కాల్స్ కేవలం కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న నెంబర్ల ద్వారా వచ్చే కాల్స్ మాత్రమే వస్తాయి. లిస్ట్ లో లేని నెంబర్ల ద్వారా ఫోన్ వస్తే సైలెంట్ మోడ్ లోకి వెళ్తుంది.
సెట్టింగ్స్ ఎలా..?
ఈ సింపుల్ ఫీచర్ వినియోగిస్తే స్పామ్ కాల్స్ నించి ప్రమాదం ఉండదు. ఎలా సెట్టింగ్స్ చేయాలంటే.. వాట్సాప్ ఓపెన్ చేసి త్రీ డాట్స్ పైన క్లిక్ చేయూలి. సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్ళాలి. ప్రైవసీ అప్షన్ వస్తుంది. ప్రైవసి ఓపెన్ చేసి అందులో కాల్స్ లో సైలెన్స్ ఆన్ నోన్ కలర్స్ ఎనెబుల్ చేయాలి. దాంతో ఇకపై స్పామ్ కాల్స్ రావు.
ఇవి కూడా చదవండి :
- WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. 15 నిమిషాల్లోనే డిలీట్.. ఎలా పని చేస్తుందంటే..!
- WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!
- WhatsApp : మీ వాట్సాప్ హ్యాక్ అయిందా.. ఎలా తెలుసుకోవాలంటే..!
- WhatsApp : వాట్సప్ యూజర్లే నేరగాళ్ల టార్గెట్.. అప్రమత్తం లేకుంటే మీ ఎకౌంటు ఖాళీ.. ఆ బ్యాంక్ సలహాలు..!









