PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

ఫోన్ పే అదిరిపోయే కొత్త సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దానివల్ల పేటీఎం ఫైన్ ల్యాబ్స్ లాంటి వాటికి గట్టి పోటీ ఎదురు కానున్నది.

మనసాక్షి , వెబ్ డెస్క్ :

యూపీఐ ప్లాట్ ఫామ్ లో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఫోన్ పే.. కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలియజేసింది. అదిరిపోయే సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. పేటీఎం, రాజోర్ పే, ఫైన్ ల్యాబ్స్ లాంటి వాటికి ఒక్కసారి షాక్ ఇచ్చింది.

 

ఫోన్ పే తీసుకువచ్చిన కొత్త సర్వీసుల వల్ల కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చును. తాజాగా పిఓఎస్ విభాగంలోకి అడుగు పెట్టింది. కొత్త పిఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) డివైజ్ లాంచ్ చేసింది. దీని ద్వారా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, యూపీఐ ద్వారా మర్చంట్ లు పేమెంట్స్ చేసుకోవచ్చు.

 

ఈ కొత్త సర్వీసుల వల్ల ఫోన్ పే కూడా పూర్తిగా ఆఫ్ లైన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ గా మారింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల తో పేమెంట్లు స్వీకరించటం తో వ్యాపారం మరింతగా పెరుగుతుందని ఫోన్ పే ఆఫ్ లైన్ బిజినెస్ హెడ్ వివేక్ తెలిపారు. ఫోన్ పే కు దేశవ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా మర్చంట్ భాగస్వాములు ఉన్నారు.

 

ఫోన్ పే పి ఓ ఎస్ తీసుకొచ్చిన సర్వీసులో పిఓఎస్ డివైస్ లో ప్రీ లోడెడ్ ఫోన్ పే పి ఓ ఎస్ యాప్ ఉంటుంది. దీని ద్వారా ట్యాప్ , స్వైప్ , డిప్ ట్రాన్సాక్షన్ నిర్వహించవచ్చును. అంతే కాకుండా ఇంటర్ ఆపరబుల్ డైనమిక్ క్యూఆర్ కోడ్స్ కూడా ఉంటాయి. నామమాత్రంగా నెలవారి చార్జీల రూపంలో ఈ పి ఓ ఎస్ డివైస్ మర్చంట్లకు అందుబాటులో ఉంటుంది.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు..  మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి.. 👇

 

1. Telangana : బీ ఈడి, డి ఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… మళ్లీ టెట్.. ఇవీ విధి విధానాలు..!

2. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!

3. Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!

4. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

 

అదే విధంగా ప్రోడక్ట్ క్వాలిటీ సర్వీసులు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI) ఆఫ్ లైన్ పిఓఎస్ డివైజ్ సర్వీసులు అందించే కంపెనీలపై డేగ కన్ను వేసింది. కేవైసీ ఇతర పేమెంట్ సేవలకు సంబంధించి కఠినమైన నిబంధనలు తీసుకురావాలని భావించింది. కాగా ఫోన్ పే ఈ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వడం మనర్హమైన విషయమే.

 

పిన్ ల్యాబ్స్, రాజోర్ పే, పేటియం వంటి కంపెనీలు పిఓఎస్ డివైస్ లు మార్కెట్లో ప్రస్తుతం దూసుకుపోతున్నాయి. ఫోన్ పే కూడా నేరుగా వీటితో పోటీపడుతుంది. ఫోన్ పే ఇటీవలనే ఆన్లైన్ పేమెంట్ గేట్ వే సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.