Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!
Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!
మనసాక్షి, వెబ్ డెస్క్ :
నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త తెలియజేసింది. వెస్ట్రన్ రైల్వేకు (western Railway) చెందిన రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (RRC) ఉద్యోగాల భర్తీ చేేయనున్నట్లు ప్రకటించింది.
ఉద్యోగాల భర్తీ కోసం RRC తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. వెస్ట్రన్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ మొత్తం 3624 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు rrc-wr.com వెబ్ సైట్లో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ 2023 జూన్ 27 నుంచి ప్రారంభమైంది. 2023 జూలై 26వ తేదీ ఆఖరి తేదీగా నిర్ణయించారు. చివరి తేదీకి మరి కొంత సమయమే ఉండడం వల్ల అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
🟢 ఎక్కువ మంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇
1. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!
2. Flipkart | నిరుద్యోగులకు శుభవార్త.. ఫ్లిప్ కార్ట్ సహకారం.. రూ. 10 లక్షలు సంపాదించే ఛాన్స్..!
3. Rythu Bima : రైతు భీమాకు ధరఖాస్తులు.. ఇలా చేసుకోవాలి..!
4. Telangana : బీ ఈడి, డి ఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… మళ్లీ టెట్.. ఇవీ విధి విధానాలు..!
🟢 విద్యార్హతలు :
ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు
> ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
> సంబంధిత ట్రేడ్ నుంచి ఐటిఐ పూర్తి చేసి సర్టిఫికెట్ పొంది ఉండాలి.
> అభ్యర్థుల వయసు జులై 26వ తేదీ నాటికి 15 నుంచి 24 సంవత్సరాల లోపు ఉండాలి.
🟢 దరఖాస్తు ఫీజు :
> ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 100 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
> ఎస్సీ/ ఎస్టీ /పిడబ్ల్యుడి/ మహిళ అభ్యర్థులకు ఫీజు రాయితీ ఉంటుంది.
> క్రెడిట్ కార్డు /డెబిట్ కార్డు /ఇంటర్నెట్ ద్వారానే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
🟢 ఉద్యోగాలకు ఎంపిక :
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడొచ్చు.









