Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIEStravelతెలంగాణహైదరాబాద్

Tourism : తిరుమల, షిర్డీ భక్తులకు గుడ్ న్యూస్.. పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు..!

Tourism : తిరుమల, షిర్డీ భక్తులకు గుడ్ న్యూస్.. పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు..!

హైదరాబాద్ , మనసాక్షి :

తెలంగాణ పర్యాటక శాఖ పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకువచ్చింది. తిరుమల, షిర్డీ కి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏసీ స్లీపర్ బస్సులు, ఏసీ మినీ బస్సు సర్వీసులను ప్రారంభించింది. హైదరాబాదు నుంచి భక్తులు ఎక్కువగా తిరుమల షిరిడి యాత్రలకు వెళుతుంటారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ప్యాకేజీలను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకువచ్చింది. వివిధ దర్శనీయ ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రత్యేక ప్యాకేజీ కల్పించింది.

 

తిరుమల, షిర్డీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు సర్వీసులను తీసుకొచ్చారు. హైదరాబాద్ తిరుమలకు సరికొత్త ప్యాకేజీ జీని తీసుకొచ్చారు. రెండు రోజుల ప్యాకేజీ లో భాగంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. పెద్దలకు రూ. 4200 , పిల్లలకు 3360 రూపాయలు టికెట్లు ఉంటాయి. ఈ ప్యాకేజీలో భక్తులకు శీఘ్రదర్శన టికెట్లను అందించనున్నారు.

 

నూతనంగా 3.5 కోట్ల రూపాయలతో 2 అత్యాధునిక వోల్వో మల్టీ ఎక్సెల్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సులను, 32. 61 లక్షల రూపాయలతో మినీ ఏసీ బస్సు సర్వీసులను పర్యాటకశాఖ కొనుగోలు చేసింది. ఈ బస్సులను ఇటీవల రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర గీత పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ పర్యాటక శాఖ ఎండి మనోహర్ తో కలిసి ప్రారంభించారు.

 

ALSO READ : 

1. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

2. GPay : గూగుల్ పే గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్.. యూపీఐ లైట్ సదుపాయం..!

3. TSRTC : హైదరాబాద్- తిరుపతి మార్గంలో డైనమిక్ ప్రైసింగ్ విధానం..?

4. GPay : గూగుల్ పే వినియోగించే వారికి భారీ గుడ్ న్యూస్.. మళ్లీ క్యాష్ బ్యాక్.. ఎలానో తెలుసుకుందాం..!

5. Lands : ఆ భూములకు కూడా రైతు బంధు.. వారికి కూడా రైతు బీమా..!

మరిన్ని వార్తలు