Lands : ఆ భూములకు కూడా రైతు బంధు.. వారికి కూడా రైతు బీమా..!

Lands : ఆ భూములకు కూడా రైతు బంధు.. వారికి కూడా రైతు బీమా..!

నర్సాపూర్ , మన సాక్షి:

మెదక్ జిల్లా నర్సాపూర్ లో అర్హులైన గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ధిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు హాజరై ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి మధన్ రెడ్డి తో కలిసి పోడు పట్టాలు పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..  దేశంలో అత్యధిక పోడు పట్టాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని, తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పొడుపట్టాలు ఇచ్చామన్నారు.?తెలంగాణ రాష్ట్రంలో 10.71 శాతం పొడుపట్టాలిచ్చి దేశంలోనే మొదటిస్తానంలో నిలిచిందని తెలిపారు. పోడు పట్టాలు పొందిన వారు నేటినుంచి వారి భూములకు రైతులు, ఓనర్లుగా మార్చిన ఘనత కేసీఆర్ దని అన్నారు.

 

ఈ భూమ్మీద ఎకరాకు రూ.10వేల రైతుబందు సాయం అందుతుందని, దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా వర్తిస్తుందని అన్నారు. పోడు పట్టాలు తీసుకున్న రైతులకు ఉచిత కరెంటు అందిస్తుందని, ఇప్పటివరకు ఏ ప్రభుత్వ పథకం అందలేదని, పంట నష్టం జరిగిన నేటి నుంచి రాయితీ పథకాలపై అందుతాయని, ఈపట్టాల ద్వారా లబ్దిదారులకు10 ప్రయోజనాలు అందనున్నట్లు, పంట రుణం అందేటట్లు భరోసా ఇచ్చారు. పోడు రైతులపై పోలీసుల ,ఫారెస్ట్ అధికారుల కేసులు ఎత్తివేస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

కాంగ్రెస్,బీజేపీలు గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని అన్నారు. కల్యాణ లక్ష్మీ పథకాన్ని గిరిజనుల ద్వారానే ప్రారంభం అయిందని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే అని కొనియాడారు. విదేశాల్లో చదువుకునేందు విద్యా నిధి ఇస్తుంది, తండాలను, గూడాలను 3146 పంచాయితీలుగా చేసింది సీఎం కేసీఆర్ ప్రభుత్వమే అని తెలిపారు.

 

 

జిల్లాలో 63 పంచాయితీల్లో గిరిజనులే సర్పంచులు అని, సేవాలాల్ జయంతిని ప్రభుత్వ పండుగగా చేసింది కేసీఆర్ అని అన్నారు.  నర్సాపూర్ నియోజకవర్గంలో రూ.100 కోట్లతో తండాలో రోడ్లు వేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్ రైతు ఎజెండాతో కాంగ్రెస్,బీజేపీ పార్టీలు పరేషాన్ అవుతున్నాయన్నారు.

 

కేసీఆర్ను తిట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ ,బీజేపీ నేతలు పెట్టుకుంటున్నారన్నారు. ఢిల్లీలో అవార్డులిచ్చి గల్లీలో తిట్టిపోస్తున్న మోడీపై ఆయన మండిపడ్డారు. అంతే కాకుండా తెలంగాణ పథకాలను ప్రధాని మోడీ కాపీ కోడుతున్నారు. మేం పనిచేయకపోతే మా పథకాలు ఎందుకు కాపీ కొడుతున్నరని మోడీకి సూటిగా ప్రశ్నించారు.

 

ALDO READ :

1. Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!

2. Gpay : గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు..!

3. Telangana : బీ ఈడి, డి ఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… మళ్లీ టెట్.. ఇవీ విధి విధానాలు..!

4. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

 

 

తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయంటే తెలంగాణ ప్రజల గొప్పతనం అని గుర్తు చేశారు. మా ప్రాజెక్టులను రద్దు చేస్తుంది కేంద్రంలోని బీజేపీ సర్కార్ అని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు హక్కుగా వచ్చే డబ్బులను మోడీ ఆపుతున్నారని ఆసహనం వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన రూ.లక్ష కోట్లు అపింది మోడీ అని తెలిపారు.

 

రైతుల మోటర్లకు మీటర్లు పెట్టమంది బీజేపీ సర్కార్ అని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుంది బీజేపీ సర్కార్ అని, కేసీఆర్ సర్కార్ ను బదులాం చేసే కుట్ర చేస్తున్నారని అన్నారు. లడ్డు గుజరాత్ కు పిప్పర్ మెంట్ తెలంగాణకు ఆయన ఎద్దేవ చేశారు.

 

7 మండలాలను ఆంధ్రలో కలిపి మోసం చేసింది కేంద్ర ప్రభుత్వం అని మండిపడ్డారు. ఈడీ, సీబీఐలను అడ్డం పెటుకొని అడ్డుకుంటున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చ పెట్టండి అని ప్రశ్నించారు. ఎన్ని ఈడి,సీబీఐలు మీవైపు ఉన్నా అంతిమంగా ధర్మమే గెలుస్తది అని అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా,అడిషనల్ కలెక్టర్లు ప్రతిమా సింగ్ ,రమేష్ హాజరయ్యారు.