Breaking Newsకామారెడ్డి జిల్లాక్రైంజిల్లా వార్తలుతెలంగాణ
Kamareddy : కామారెడ్డిలో భయానకం.. ఒక్కసారిగా మూడు కార్లు దగ్ధం..!
కామారెడ్డి లో భయానక పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు మూడు కార్లు దగ్ధమయ్యాయి.

Kamareddy : కామారెడ్డిలో భయానకం.. ఒక్కసారిగా మూడు కార్లు దగ్ధం..!
మన సాక్షి, కామారెడ్డి :
కామారెడ్డి లో భయానక పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు మూడు కార్లు దగ్ధమయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రమైన మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో కారులో ఎల్పిజి గ్యాస్ నింపుతుండగా ఒకసారిగా మంటలు అంటుకొని పేలుడు సంభవించింది. ఒక్కసారిగా కారు ట్యాంకర్ పేలడంతో దట్టమైన పొగ తో దగ్ద మైయింది.
అదేవిధంగా గ్యాస్ నింపుతున్న కారు పక్కన పార్కింగ్ చేసిన మరో రెండు కార్లు, బైకు కూడా దగ్ధమయ్యాయి. ఈ ఘటన తో భారీ శబ్దాలు రావడంతో పరుగులు తీసిన జనాలు. ఫైర్ ఇంజన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ అధికారులు చేరుకొని మంటలు ఆర్పుతున్నారు.









