Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
Hyderabad : జూబ్లీహిల్స్ లో దారుణం.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య..!
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునంద హత్యకు గురైంది.

Hyderabad : జూబ్లీహిల్స్ లో దారుణం.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య..!
హైదరాబాద్, మన సాక్షి:
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునంద హత్యకు గురైంది. జూబ్లీహిల్స్ లోని ప్రశాష్ కాలనీ ఐఏఎస్ క్వార్టర్స్ లో ఈ ఘటన జరిగింది. పనిమనిషి కల్పన హత్య చేసినట్లుగా ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు. అర్థరాత్రి సమయంలో హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం బృందం విచారణ జరుపుతున్నారు.









