Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంరాజకీయం

తమిళనాడులో దళపతి శకం.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి లైన్ క్లియర్..!

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం కలిగించిన విజయ్ ప్రస్థానం ఇక మొదలుకానున్నది. తమిళనాడులో దళపతి శకం ప్రారంభం కానున్నది.

తమిళనాడులో దళపతి శకం.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి లైన్ క్లియర్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం కలిగించిన విజయ్ ప్రస్థానం ఇక మొదలుకానున్నది. తమిళనాడులో దళపతి శకం ప్రారంభం కానున్నది. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగా వెట్రి కజగం (TVK ) పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 స్థానాలు కావాల్సి ఉండగా ఉత్కంఠ నెలకొన్నది. సరిపడా మద్దతు లేకపోవడంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదు. దాంతో మరింత ఉత్కంఠ నెలకొన్న తమిళనాడు రాజకీయాలకు తెరపడింది.

టీవీకే కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించగా కొత్తగా సిపిఐ, సిపిఎం, విసికె పార్టీలు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని స్పష్టం చేశాయి. దాంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ కోసం ఎదురుచూస్తున్న విజయ్ కి ఎర్రజెండా పార్టీల నిర్ణయం కొండంత అండగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీతో వామపక్ష పార్టీలు కూడా విజయ్ తోటే ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నాయి.

దాంతో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి అవసరమైన బలం సమకూరినట్లుంది. విజయ్ ప్రస్థానంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, వామపక్షాలను ఒకే తాటిపైకి తీసుకురావడం విజయ్ సఫలమయ్యారు. కాగా విజయ్ అతి త్వరలోనే లోక్ భవన్ కి వెళ్లి గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరనున్నారు. తమిళనాడులో కొత్త పార్టీ కొలువు తీరబోతుండగా టీవీకే శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

మరిన్ని వార్తలు