Miryalaguda : వీళ్ళు మామూలోళ్ళు కాదు, యూట్యూబ్ చూసి చోరీలు.. అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు..!
దామరచర్ల మండల కేంద్రంలో జరిగిన ఏటీఎం దొంగతనపు ప్రయత్నం కేసులో వాడపల్లి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వాడపల్లి ఏఎస్ ఐ కె. జోజి, వారి సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి కీలక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు.

Miryalaguda : వీళ్ళు మామూలోళ్ళు కాదు, యూట్యూబ్ చూసి చోరీలు.. అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
దామరచర్ల మండల కేంద్రంలో జరిగిన ఏటీఎం దొంగతనపు ప్రయత్నం కేసులో వాడపల్లి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వాడపల్లి ఏఎస్ ఐ కె. జోజి, వారి సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి కీలక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరాలు:
మోతుకూరి రమణ చారి (36) సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మండలం, రామాపురం గ్రామ నివాసి. ప్రస్తుతం జడ్చర్లలోని స్నేహ ఫుడ్స్ సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
వేరే మోహన కుమార్ రెడ్డి (31) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ప్రస్తుతం జడ్చర్లలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు.
కేసు పూర్వాపరాలు:
నిందితులిద్దరూ గతంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న సమయంలో స్నేహితులయ్యారు. అక్కడ వచ్చే జీతం సరిపోకపోవడంతో, మెరుగైన ఉపాధి కోసం వెతుకుతూ ఏప్రిల్ నెలలో తమ పాత ఉద్యోగాలు మానేశారు.
నేరం జరిగిన తీరు:
ఏప్రిల్ 23, 2026న నించితులిద్దరూ దామరచర్ల ఏ -1 యొక్క స్నేహితుడు రమేష్, లావూరితండా ను కలిసి అతని ద్వారా వైటీపీఎస్ లలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం సంపాదించడం కోసం రాగా అక్కడ అధికారులు లేనందున అదే రోజు దమరాచెర్ల లో గల తిరుమల తిరుపతి వైన్ షాపులో మద్యం సేవించారు. రమేశ్ అక్కడి నుండి వెళ్లిపోగ, ఇద్దరు దమరచెర్ల లోనే ఉండి. రాత్రి సమయంలో అక్కడ ఉన్న ఏటీఎంను చూసి, అందులో దొంగతనం చేస్తే తమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పథకం వేశారు.
దొంగతనం ఎలా చేయాలో తెలుసుకోవడానికి వారు యూట్యూబ్ వీడియోల సహాయం తీసుకున్నారు. అదే రోజు రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో, ముఖాలకు దస్తీలు కట్టుకుని, రోడ్డు పక్కన దొరికిన ఒక ఇనుప రాడ్డుతో ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించారు. ఏటీఎం షట్టర్ దించి, మిషన్ను పగులగొట్టేందుకు యత్నిస్తుండగా సెక్యూరిటీ అలారం మోగింది. దీంతో భయపడి వారు అక్కడి నుండి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులకు దొరక్కుండా డేందుకు జడ్చర్లలో సెక్యూరిటీ ఉద్యోగాల్లో చేరారు.
నేరస్తుని గుర్తించిన తీరు :
పరిశోధనాధికారి ఏటీఎంలో గల సి సి పుటేజ్ ను సర్కులేట్ చేయగా, సి సి ఫుటేజ్ ను చూసిన రమేశ్, అట్టి వ్యక్తిని గుర్తించిన నేరస్థుడి వివరాలు ఎస్ఐఐ వాడపల్లి కి తెలియపరచగా, నేరస్థులను
గుర్తించనైనది.
అరెస్ట్ మరియు రికవరీ:
శనివారం రమణ చారి తన ఇంటి సామాగ్రిని జడ్చర్లకు తరలించడానికి రామాపురం రాగా, సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి కింది వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
నేరానికి ఉపయోగించిన రెండు అడుగుల ఇనుప రాడ్డు. ఒక నల్లటి కాలేజీ బ్యాగ్, ఒకఒప్పో నీలి రంగు స్మార్ట్ ఫోన్. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. వారిని కోర్టులో హాజరుపరిచి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.
మిర్యాలగూడ డి ఎస్ పి రాజా శేఖర రాజు సూచనలపై, సి ఐ ప్రసాద్ ఆధ్వర్యములో ఇట్టి కేసును భేదించి నేరస్తులను పట్టుబడి చేసిన, శ్రీకాంత్ రెడ్డి, ఏ ఎస్ ఐ జోజీ లతో పాటు పిసి- సైదులు, సంతోష్ రెడ్డి. యాదగిరి లను నల్గొండఎస్ పి శరత్ చంద్ర పవర్ అభినందించారు.









