Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయం

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. మూడేళ్ల పాటు మరో కొత్త పథకం.. రూ. 3.6 లక్షల కోట్లు కేటాయింపు

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. మూడేళ్ల పాటు మరో కొత్త పథకం.. రూ. 3.6 లక్షల కోట్లు కేటాయింపు

మనసాక్షి, వెబ్ డెస్క్:

దేశవ్యాప్తంగా రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. రైతుల కోసం మరో కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా దేశంలోని 15 కోట్ల మంది రైతులకు ఉపయోగం పడే అవకాశం ఉంది. అందుకుగాను భారీ బడ్జెట్ కూడా కేటాయించారు. ఈ పథకం మూడేళ్లపాటు కొనసాగనున్నది.

 

యూరియా సబ్సిడీ పథకాన్ని కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2022- 23 నుంచి 2024 – 25 వరకు మూడేళ్లపాటు ఈ పథకాన్ని కొనసాగించనున్నారు. దానికోసం గాను ఈ పథకం కు రూ. 3,68,676 కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది.

 

2023 – 24 వానాకాలం సీజన్ కు గాను రూ. 38 వేలకోట్ల పోషకాల ఆధారిత సబ్సిడీ కాకుండా అదనంగా సబ్సిడీని ప్రకటించారు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది .

 

కేంద్ర ప్రభుత్వం యూరియా సబ్సిడీ పథకాన్ని కొనసాగించడం వలన పన్నులు, నీమ్ కోటింగ్, చార్జీలు మినహాయించి ఒక్క యూరియా బస్తాకు రూ. 242 చొప్పున రైతులు కొనుగోలు చేయవచ్చును. భూమిలో సల్ఫర్ లోపం అధిగమించేందుకు గాను ప్రభుత్వం యూరియా గోల్డ్ (Urea Gold)ను కూడా ప్రవేశపెట్టింది.

 

♦️ఎక్కువమంది చదివిన వార్తలు… మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి 👇

 

  1. Rythu Bandhu : రైతుబంధు జాబితాలో మీ పేరు ఉందా? డబ్బులు ఎకౌంట్ లో పడ్డాయో..? లేదో..? ఇలా చెక్ చేసుకోండి..!
  2. RBI : రూ. 2 వేల నోట్ల రద్దు పై ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
  3. Viral Video : మోటార్‌సైకిల్‌పై ప్రేమికుల విచిత్ర సంఘటన, రూ. 21 వేలు చలాన్ ( వీడియో వైరల్)
  4. PhonePe : ఫోన్ పే లో లోన్లు.. రూ.15 వేల నుంచి రు. 5 లక్షల వరకు..!
  5. Telangana | ప్రభుత్వ పాఠశాలల వేళల్లో మార్పు.. టైమింగ్స్ ఇదే..!

 

అదేవిధంగా చెరుకు ధరలను క్వింటాకు 10 రూపాయల చొప్పున పెంచుతూ ఆమోదం తెలిపింది. దాంతో చెరుకు రైతుకు క్వింటా కు 315 రూపాయలు ధరను ఆమోదించింది.

 

అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మార్కెట్ అభివృద్ధి సహాయం పథకం (MDA) కోసం 1451 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదించింది.

మరిన్ని వార్తలు