Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవిద్యహైదరాబాద్

Telangana | ప్రభుత్వ పాఠశాలల వేళల్లో మార్పు.. టైమింగ్స్ ఇదే..!

Telangana | ప్రభుత్వ పాఠశాలల వేళల్లో మార్పు.. టైమింగ్స్ ఇదే..!

హైదరాబాద్, మనసాక్షి :

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల వేళల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. బడి వేళల మార్పుపై అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చును. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు వేరువేరు సమయాలను లో నిర్వహిస్తున్నారు. కాగా రెండు పాఠశాలలు కూడా ఒకే సమయంలో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.

 

ప్రస్తుతం తెలంగాణలో ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 గంటలకు నుంచి 4:45 గంటల వరకు నిర్వహిస్తున్నారు.

 

ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులు 10 సంవత్సరాలలోపు ఉన్నవాళ్లే ఉంటారు. వారు ఉదయమే లేచి పాఠశాలకు రావటం చాలా ఇబ్బందిగా మారిందనే విషయాన్ని అధికారులు భావిస్తున్నారు. అందుకుగాను ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు 9:30 గంటల నుంచి ప్రారంభించాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. దాంతో పాఠశాలల వేళల్లో మార్పు చేసే అవకాశం ఉంది.

 

♦️ ఎక్కువ మంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి 👇

🟢 Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్..!
🟢 Rythu Bandhu scheme : రైతుబంధుపై కీలక ప్రకటన.. రైతులకు గుడ్ న్యూస్…!
🟢 Gruhalakshmi scheme : గృహలక్ష్మీ పథకంలో ప్రభుత్వం ఇచ్చే రూ. 3 లక్షలు రావాలంటే.. ఇవి ఉండాల్సిందే..!
🟢 సూర్యాపేట : ఎన్నికలు వస్తున్నాయని శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ గుర్తొచ్చిందా..? – పొంగులేటి
🟢 Latest Jobs : ఏదైనా డిగ్రీ ఉంటే.. ఉద్యోగ అవకాశాలు, భారీ ప్యాకేజీ..!

ప్రైవేటు పాఠశాలల బస్సులు పట్టణ ప్రాంతంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉదయం 8 గంటల నుంచి తిరుగుతుంటాయి. ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులు వెళుతుంటే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఆలస్యంగా వెళ్తే ఎలా ఉంటుందో..? అనే ఆలోచన కూడా అధికారులు చేస్తున్నారు.

 

అంతేగాకుండా ఉదయం వేళలోనే విద్యార్థులు ప్రశాంతంగా ఉండటం… వారికి చెప్పే చదువు తొందరగా అర్థమవుతుందని ఆలోచనలో కూడా అధికారులు ఉన్నారు. ఏదేమైనా పాఠశాలల వేళల్లో మార్పు వచ్చే అవకాశం ఉందా..? లేదా.? అనేది త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు