సూర్యాపేట : ఎన్నికలు వస్తున్నాయని శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ గుర్తొచ్చిందా..? – పొంగులేటి

సూర్యాపేటలో పొంగులేటికి ఘన స్వాగతం

సూర్యాపేట : ఎన్నికలు వస్తున్నాయని శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ గుర్తొచ్చిందా..? – పొంగులేటి

సూర్యాపేట , మనసాక్షి

హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామంలో పొంగులేటి అనుచరులు పెద్దిరెడ్డి రాజా, శెనగాని రాంబాబు, మోదుగు నాగిరెడ్డి, నెరేళ్ల మధు, బాషాపంగు భాస్కర్  ల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం విలేకరులతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.

 

అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రభుత్వ సొమ్ముతో దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు,ఏమి సాధించారని దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు అని ప్రశ్నించారు.దోచుకున్న సొమ్ము ఎక్కడ ఖర్చు చేస్తే తగ్గిపోతుందోనని ధనిక రాష్ట్రమైన తెలంగాణను రూ.5లక్షల కోట్ల అప్పు చేసి ఇంకా అప్పుల పాలు చేసేందుకు  ప్రభుత్వ సొమ్ముతో దశాబ్ది ఉత్సవాల నిర్వహిస్తున్నారు అని విమర్శించారు.

 

చెరువులలో నాలుగు గంపల మట్టి తీసి 26వేల చెరువుల పునరుద్ధరణ చేసిన అని గొప్పలు చెప్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఆ చెరువులను నిర్మించిన పార్టీలను ఎంత సన్మానించినా తక్కువే అన్నారు.చౌక బారు ఎత్తుగడలతో మూడోసారి అధికారంలోకి రావలనుకుంటు నమ్మబలికె ప్రయత్నాలు చేస్తున్నారని,

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి 👇

♦️Latest Jobs : ఏదైనా డిగ్రీ ఉంటే.. ఉద్యోగ అవకాశాలు, భారీ ప్యాకేజీ..!

♦️Rythu Bandhu : రైతు బంధు కోసం దరఖాస్తులు చేసుకోవాలి..!

♦️ RBI : రూ. 30 వేల కంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే.. ఆర్బీఐ క్లారిటీ..!

♦️ RBI : రూ. 30 వేల కంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే.. ఆర్బీఐ క్లారిటీ..!

♦️ PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు, కస్టమర్లకు రూ. 2 లక్షల ఆదా…!

 

ఈ సారి యావత్ తెలంగాణ ప్రజానీకం మోసపోవడానికి సిద్ధంగా లేరని అన్నారు.  ఎన్నికలప్పుడే కేసీఆర్ కు  ప్రజలు, ఉద్యమకారులు  గుర్తొస్తారు తప్ప గడిచిన 9ఏండ్లలో గుర్తురాని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు గుర్తొచ్చిందా అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా రూ.5లక్షలను  రూ. 3లక్షలు చేశారు

 

తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని కలలు కన్న తెలంగాణ బిడ్డలు కోర్కెలు  కలలుగానే మిగిలిపోయాయని , మాయమాటలతో మభ్యపెడుతూ  తెలంగాణ ప్రజల కష్టసుఖాలను వదిలేసి కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే తాపత్రయ పడుతున్నారు అని విమర్శించారు.

 

ప్రజల ఆంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ మోసం చేశాడని. మభ్య పెట్టె మాటలతో మూడో సారి అధికారంలోకి రావలనుకుంటు కలలు కంటున్న  కల్వకుంట్ల కుటుంబానికి కలలు కలలుగానే మిగిల్చలని కోరారు. కష్టపడి పని చేసి తెలంగాణ బిడ్డలకు, వారి ఆత్మ గౌరవం నిలిపేందుకు తమ టీం తరుపున కృషి చేస్తాం.

 

కలలు కన్న తెలంగాణ సాదించుకోవలన్న, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్  పార్టీని తిరిగి ప్రజలకు అండగా ఉండాలన్న సూచనలతో త్వరలో మంచి నిర్ణయం తీసుకోబోతున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తుననాయకులు , కార్యకర్తలు  పాల్గొన్నారు..