Rythu Bandhu : రైతు బంధు కోసం దరఖాస్తులు చేసుకోవాలి..!

Rythu Bandhu : రైతు బంధు కోసం దరఖాస్తులు చేసుకోవాలి..!

సంగారెడ్డి (కంగ్టి) మన సాక్షి :

రైతులు కొత్తగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములకు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది ఈ ఏడాది వానాకాలం సీజన్ కు గాను 2023 జూన్ 26వ తేదీ నుంచి రైతుబంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం విధితమే.

 

రోజు కొంతమంది రైతుల చొప్పున ముందుగా ఒక ఎకరం లోపు ఉన్న రైతులకు రైతుబంధు సహాయం వారి వారి బ్యాంకు ఖాతాలలో అధికారులు జమ చేస్తారు. ఈ నేపథ్యంలో 2023 జూన్‌ 16వ తేది లోపు వ్యవసాయ భూమి కొత్తగా రిజిస్టేషన్‌ చేయించుకున్న రైతుల నుండి అధికారులు రైతుబంధు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

 

ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఆయా సంబంధిత క్లస్టర్‌ గ్రామాల ఏఈవో లు తమ ఆఫీస్‌ లో రైతుబంధు దరఖాస్తులు తీసుకునేందుకు అందుబాటులో ఉంటున్నారని వ్యవసాయాధికారి ప్రవీణ్ చారి తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

ఎక్కువ మంది చదివిన వార్తలు … మీరు కూడా చదవడానికి క్లిక్ చేయండి 👇