Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో ఏసీబీ అధికారుల దాడులు.. లంచం తీసుకుంటూ దొరికిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ వక్ఫ్ బోర్డు అధికారి ఏసీబీ అధికారులకు దొరికారు.

Miryalaguda : మిర్యాలగూడలో ఏసీబీ అధికారుల దాడులు.. లంచం తీసుకుంటూ దొరికిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ వక్ఫ్ బోర్డు అధికారి ఏసీబీ అధికారులకు దొరికారు. వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బాధితుడి నుంచి పదివేల రూపాయలు లంచం తీసుకుంటుండగా (ఏసీబీ) అవినీతి నిరోధక శాఖ అధికారులు వక్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
సప్లమెంటరీ నివేదికను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు పంపేందుకు కాను లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని మందుల వారి కాలనీలో ఉన్న ఇన్స్పెక్టర్ మహమూద్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
- Hyderabad : అమీర్ పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు, పొగ..!
- Good News : తెలంగాణలో ఉపాధ్యాయులకు భారీ శుభవార్త.. విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్..!
- District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఈ నెల 10లోపు ఆ పనులు పూర్తి చేయాలి..!
- TS News: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..!









