Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

NTR Statue : నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహానికి మంటలు.. ప్రమాదమా..? కుట్రనా..?

నల్గొండ జిల్లా కేంద్రంలో అపశృతి నెలకొన్నది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి మంటలు అంటుకున్నాయి. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మంటలు అంటుకున్నాయి.

NTR Statue : నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహానికి మంటలు.. ప్రమాదమా..? కుట్రనా..?

నల్గొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లా కేంద్రంలో అపశృతి నెలకొన్నది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి మంటలు అంటుకున్నాయి. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మంటలు అంటుకున్నాయి. ఈ విషయాన్ని శనివారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేశారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది ఎన్టీఆర్ విగ్రహాన్ని శుభ్రపరిచే పనులు చేపట్టారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ విగ్రహానికి ఎవరైనా కావాలనే నిప్పంటించారా..? లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు