Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి భారీ షాక్.. ఈయు కూటమి విజయభేరి..!

తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కూటమికి భారీ షాక్ తగిలింది. ఈయూ కూటమి విజయభేరి మోగించింది. పది సంవత్సరాల విరామం తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కూటమికి చేదు అనుభవం ఎదురు కావడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా ఈ ఎన్నికలు మారాయి.

ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి భారీ షాక్.. ఈయు కూటమి విజయభేరి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో

తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కూటమికి భారీ షాక్ తగిలింది. ఈయూ కూటమి విజయభేరి మోగించింది. పది సంవత్సరాల విరామం తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కూటమికి చేదు అనుభవం ఎదురు కావడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా ఈ ఎన్నికలు మారాయి.

గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ యూనియన్ కూటమి రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది. ప్రభుత్వం బాహాటంగా అండదండలు అందించిన తెలంగాణ వర్కర్స్ యూనియన్ కు కార్మికులు కంగు తినిపించారు.

రాష్ట్రస్థాయి ప్రధాన గుర్తింపు సంఘం ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికీ రీజియన్లు, నాన్ ఆపరేటింగ్ యూనిట్లలో స్థానిక గుర్తింపు ఎవరికి దక్కించుకునే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం టిఎంయు మూడు రీజియన్లు, టి డబ్ల్యూ యు 6 రీజన్లలో స్థానిక గుర్తింపు దిశగా ఆదిత్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. రిజియాన్ ల వారీగా అధికారిగా వివరాలు వెల్లడి కావలసి ఉంది. ఎన్నికలకు సంబంధించి తుది ఫలితాలను ఈనెల 17వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అశ్వద్ధామ రెడ్డి, రాజిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న టీ డబ్ల్యూయు కు మద్దతు ప్రకటించింది. పార్టీ తరపున ఎన్నికల ఇన్చార్జిగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను రంగంలోకి దించి విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. అయితే వెలువడిన ఫలితాలు అధికార పార్టీకి షరాగతంగా మారాయి. ప్రభుత్వం అండగా నిలిచినప్పటికి కార్మికులు మాత్రం సాంప్రదాయ జేఏసీ పక్షాన్ని మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ఆధ్వర్యంలో బరిలోకి దిగిన ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ ల కూటమి కార్మికుల సంపూర్ణ విశ్వాసం చూరగొన్నది.

మరిన్ని వార్తలు