Miryalaguda : శిష్య పాఠశాలలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు..!
మిర్యాలగూడ పట్టణంలోని చైతన్యనగర్ లోని శిష్యపాఠగాలలో అంగరంగ వైభవంగా బతుకమ్మ, దసరా సంబరాలు శుక్రవారం జరిగాయి.

Miryalaguda : శిష్య పాఠశాలలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని చైతన్యనగర్ లోని శిష్యపాఠగాలలో అంగరంగ వైభవంగా బతుకమ్మ, దసరా సంబరాలు శుక్రవారం జరిగాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ష్రిన్సిపాల్ అల్లుచెల్లి శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ అల్లుచెల్లి శీరిషా మేడం బతుకమ్మ, దసరా పండుగ ప్రాముఖ్యతను గురించి చాలా చక్కగా విద్యార్థులకు వివరించడం జరిగింది. తెలంగాణ ఆచార సాంప్రదాయాల గురించి బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ మాత్రమే కాదు, అది తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రకృతి ఆరాధనకు నిదర్శనం అని చెప్పారు.
ఈ పండుగలో వివిధ రకాల పూలతో ఎంతో చక్కగా అలంకరిస్తారని, తొమ్మది రోజుల పాటు ఈ వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటారని, చివరి రోజు బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేసి ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతారని, అన్నారు. మన ఈ సాంప్రదాయాన్ని బావి తరాలకు అందించే ఈ పండుగ మన అందరిది అని చాలా చక్కగా వివరించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రుల ముందస్తు బతుకమ్మను ఎంతో చక్కగా రంగురంగుల పూలతో పేర్చి తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా బతుకమ్మ అట పాట నిర్వహించారు. విద్యార్థుల అమ్మవారి వేషధారణ లలో ఎంతో చక్కగా అలంరించారు . ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయడం జరిగింది.












