PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు, కస్టమర్లకు రూ. 2 లక్షల ఆదా…!

PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు, కస్టమర్లకు రూ. 2 లక్షల ఆదా…!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

దిగ్గజ ఫోన్ పే సంస్థ కొత్త సర్వీస్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల వినియోగదారులకు ప్రతినెల 2 లక్షల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కొద్దిరోజుల వరకే అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సేవలతో చాలామందికి ఊరట కలగనున్నది ముఖ్యంగా వ్యాపారులకు చాలా బెనిఫిట్ కలుగుతుంది.

 

ఫోన్ పే కొత్తగా సొంతంగానే పేమెంట్ గేట్ వే సర్వీసులు ప్రారంభించింది. ఎం ఎస్ ఎం ఈ లు లక్ష్యంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

 

పేటీఎం , పేయు , ఫైనాన్స్ రాజోర్ పే, లాంటి ఇతర సంస్థల జాబితాలోకి ఫోన్ పే కూడా చేరింది. ఈ కొత్త సేవల ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారులకు అనేక రకాల బెనిఫిట్స్ అందిస్తుంది. సెటప్ ఫీజు ఉండదు .. వార్షిక మైంటెనెన్స్ ఉండదు. దీంతో MSME లకు బెనిఫిట్ కలుగుతుంది.

 

చాలా సంస్థలు పేమెంట్ గేట్వే ట్రాన్సాక్షన్ ఫీజు రెండు శాతం వసూలు చేస్తుంటాయి. కానీ వ్యాపారులకు ఊరట కలిగే విధంగా కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది . ప్రతి నెల సేల్స్ కోటి రూపాయల వరకు కలిగిన వ్యాపారులకు రెండు లక్షల రూపాయల వరకు ఆదా అవుతుంది. వ్యాపారులు ఉచితంగానే ఫోన్ పే గేటు వే సర్వీసులను పొందొచ్చును. ఇది కొంతకాలం మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి.

 

ఫోన్ పే గేట్వే ప్లాట్ ఫామ్ లోకి చేరేవారికి 8 లక్షల రూపాయల వరకు ఆదా అవుతుందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ డబ్బులను ఇతర వాటిలో పెట్టుబడిగా పెడితే మరింత బెన్ ఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి.

 

ALSO READ : WhatsApp : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్, మాటల్లేవ్ .. ఇక మాట్లాడుకోవడాల్లేవ్..!

 

ఫోన్ పే పేమెంట్ గేట్వే పై బకింగో ఫౌండర్ సుమన్ పత్ర మాట్లాడుతూ.. ఈ కామర్స్ బిజినెస్ కలిగిన వారికి నమ్మకమైన పేమెంట్ గేట్వే ఉండాల్సిందేనని పేర్కొన్నారు. ఫోన్ పే వంటి భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం చాలా సంతోషకరమైన విషయమని, వినియోగదారులు మెరుగైన సర్వీసులు పొందడానికి ఫోన్ పే తమకు చాలా ఉపయోగా పడుతుందని పేర్కొన్నారు. ఫోన్ పే డ్రాప్స్ తగ్గాయని , పేమెంట్ సక్సెస్ రేట్ పెరుగుతుందన్నారు.

 

ఫోన్ పే యూపీఐ మార్కెట్లో సుమారుగా 50 శాతానికి ఆక్రమించి ఉంది. ఫోన్ పే చాలా ట్రాన్జక్షన్లను నిర్వహిస్తోంది పెద్ద మొత్తంలోని లావాదేవీలను కూడా ఫోన్ పే సింపుల్ గా చేయగలుగుతుంది. వ్యాపారులకు బెస్ట్ ఇన్ క్లాస్ సర్వీసులు అందించడానికి పేమెంట్ గేట్ వే విభాగంలో కూడా ఇది అడుగు పెట్టింది.

 

ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి…👇