TSRTC : టిఎస్ ఆర్టీసి ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ .100 తో 60 కిలోమీటర్లు రాను పోను..!

TSRTC : టిఎస్ ఆర్టీసి ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ .100 తో 60 కిలోమీటర్లు రాను పోను..!

హైదరాబాద్ , మనసాక్షి :

ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలియజేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజనుల కోసం టి -9 టికెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

 

గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటికే t – 24, t -6 f – 24 టికెట్లను అందిస్తున్న విషయం తెలిసిందే . కాగా గ్రామీణ ప్రాంతాలలో కూడా తొలిసారిగా t- 9 టికెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది.

 

అందుకు గాను t – 9 టికెట్ వాల్ పోస్టర్ ను ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ శుక్రవారం బస్ భవన్ లో ఆవిష్కరించారు. ఈనెల 18వ తేదీ నుంచి పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్దనే అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు.

 

టీ -9 టికెట్ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు , సీనియర్ సిటిజనులకు ఇవ్వనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టీ – 9 టికెట్ చెల్లుబాటు అవుతుంది. దీని ద్వారా 60 కిలోమీటర్ల పరిధిలో ఒకసారి రాను పోను ప్రయాణం చేసే అవకాశం ఉంది.

 

ఈ టికెట్ ధర 100 రూపాయలుగా నిర్ణయించారు. టోల్గేట్ చార్జీల పైన మినహాయింపు ఇచ్చింది. కాగా ఈ టికెట్ కొనుగోలు చేసిన వారికి ఒక్కొక్క ప్రయాణికుడికి 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు ఆదా అవుతుందని ఆర్టీసీ సంస్థ ప్రకటించింది.

 

సీనియర్ సిటిజన్ ను గుర్తించడం ఎలా :

ఆర్టీసీ టీ – 9 టికెట్ కొనుగోలు చేయడానికి సీనియర్ సిటిజెన్ ను ఆర్టీసీ కండక్టర్ గుర్తిస్తాడు. టికెట్ కొనుగోలు చేసే సీనియర్ సిటిజన్ వయసు ధ్రువీకరణకు తమ ఆధార్ కార్డును కండక్టర్ కు చూపించాలి. 60 సంవత్సరాల పైబడి సీనియర్ సిటిజన్ ఉండాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ టికెట్లను కండక్టర్లు ఇస్తారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది.

 


15 లక్షల మంది ప్రయాణికులు :

 

పల్లె వెలుగు బస్సుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వారిలో మహిళలు, సీనియర్ సిటిజన్ లు ఎక్కువగా ఉన్నారు . వారి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో పల్లె వెలుగు బస్సుల్లో టీ – 9 టికెట్ ను ప్రారంభించింది. టీ – 9 టికెట్ ద్వారా వంద రూపాయలు చెల్లించి 60 కిలోమీటర్లు రానుపోను ప్రయాణం చేసే సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ ఈ సందర్భంగా కోరారు.

 

గ్రేటర్ హైదరాబాదులో అనూహ్య స్పందన :

హైదరాబాదులో టి -24, టి -6, f – 24 టికెట్లను ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా ప్రయాణికుల నుంచి దీనికి అనూహ్య స్పందన లభిస్తుంది. అందుకోసం గాను గ్రామీణ , పట్టణ ప్రాంతాల ప్రయాణికులకు గాను t -9 టికెట్ ను తీసుకొచ్చినట్లు సజ్జనార్ పేర్కొన్నారు. ఈ టికెట్ కి సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040 – 6944 00 00 , 040 – 2345 00 33 సంప్రదించాలని ఆయన సూచించారు.

 

ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి…👇