Madgulapalli : పోలీస్ అధికారులు సంచలన ప్రకటన.. గ్యాంగులు సంచరిస్తున్నాయి, వారి పట్ల జాగ్రత్త..!
మండలంలో ఇటీవల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పక్కమండలాలు పరిసర ప్రాంతాల్లో దొంగల గ్యాంగులు సంచరిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం ఉన్నందున మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మాడ్గులపల్లి ఎస్ఐ పంగ సురేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

Madgulapalli : పోలీస్ అధికారులు సంచలన ప్రకటన.. గ్యాంగులు సంచరిస్తున్నాయి, వారి పట్ల జాగ్రత్త..!
మాడ్గులపల్లి, మనసాక్షి:
మండలంలో ఇటీవల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పక్కమండలాలు పరిసర ప్రాంతాల్లో దొంగల గ్యాంగులు సంచరిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం ఉన్నందున మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మాడ్గులపల్లి ఎస్ఐ పంగ సురేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాత్రి సమయంలో ఇంటి తలుపులు, కిటికీలు సరిగా లాక్ చేసుకోవాలని, ఇంట్లో ఎక్కువ మొత్తంలో బంగారం, డబ్బు ఉంచకుండా వీలైనంత వరకు బ్యాంకులో భద్రపరచాలని సూచించారు.
Also Read : Miryalaguda : మిర్యాలగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి డేట్ ఫిక్స్..!
గ్రామాల్లో కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే 112 లేదా వేములపల్లి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, ఊరు విడిచి బయటకు వెళ్లే సమయంలో పక్కింటి వారికి, పోలీసులకు ముందు గా తెలియజేయాలని కోరారు.
వీలైనంత వరకు ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పండుగలు, శుభకార్యాలకు వెళ్లే ముందు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇంట్లో విలువైన వస్తువులు, బంగారం ఉంచవద్దని తెలిపారు. మీ పరిసరాల్లో ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయ కుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రజలు భద్రతే పోలీసుల బాధ్యత అని అయన పేర్కొన్నారు.
పోలీసులు 24 గంటలు ప్రజలకు అందుబాటు లో ఉంటారని ఎస్ఐ సురేష్ యాదవ్ తెలిపారు. అత్యవసర పోలీస్ సహాయం కోసం 112, వేములపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ 8712670192 నంబర్ ను సంప్రదించాలని అయన కోరారు.









