జోగిని దారుణ హత్య, భారీ దోపిడీ, కారుతో సహా పరారైన దుండగులు..!
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అర్ధరాత్రి చోటుచేసుకున్న దారు ణ హత్య తీవ్ర కలకలం రేపింది. జోగినిగా పేరొందిన రాళ్లబండి సుధాకర్‌ను గుర్తుతెలియని దుం డగులు అత్యంత దారుణంగా హత్య చేసి, భారీ దోపిడీకి పాల్పడ్డారు

జోగిని దారుణ హత్య, భారీ దోపిడీ, కారుతో సహా పరారైన దుండగులు..!
–60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ
మన సాక్షి, చౌటుప్పల్:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అర్ధరాత్రి చోటుచేసుకున్న దారు ణ హత్య తీవ్ర కలకలం రేపింది. జోగినిగా పేరొందిన రాళ్లబండి సుధాకర్‌ను గుర్తుతెలియని దుం డగులు అత్యంత దారుణంగా హత్య చేసి, భారీ దోపిడీకి పాల్పడ్డారు.హత్య అనంతరం ఇంట్లో ఉన్న సుమారు 60 తులాల బం గారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదును దుండగులు అపహరించారు. అంతటితో ఆగకుండా సుధాకర్‌కు చెందిన కారును సైతం ఎత్తుకెళ్లి అక్కడి నుంచి పరార య్యారు.
ఒకే ఘటనలో హత్యతో పాటు భారీ దోపిడీ జరగడంతో స్థాని కంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందు కున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి కీలక ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలు, దుండగుల ఆచూ కీ, దోపిడీ వెనుక ఉన్న వ్యక్తుల వివరాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీ యాంశంగా మారింది.









