Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Miryalaguda : ఎమ్మెల్యే బిఎల్ఆర్ కీలక ఆదేశం.. దెబ్బతిన్న వరి పంటల వివరాలు సిద్ధం చేయాలి..!

దామరచర్ల మండలంలోని బెట్టే తండా, రాళ్లవాగు తండా గ్రామాల్లో ఇటీవల వీచిన ఈదురుగాలులు, కురిసిన వర్షాలకు నేలకొరిగిన వరి పంటలను సోమవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పరిశీలించారు.

Miryalaguda : ఎమ్మెల్యే బిఎల్ఆర్ కీలక ఆదేశం.. దెబ్బతిన్న వరి పంటల వివరాలు సిద్ధం చేయాలి..!

మన సాక్షి, దామరచర్ల :

దామరచర్ల మండలంలోని బెట్టే తండా, రాళ్లవాగు తండా గ్రామాల్లో ఇటీవల వీచిన ఈదురుగాలులు, కురిసిన వర్షాలకు నేలకొరిగిన వరి పంటలను సోమవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతులతో కలిసి దెబ్బతిన్న వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట నష్టానికి సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అకాల గాలివానల కారణంగా పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Also Read : రాప్తాడు నిందితుడి పరిస్థితి విషమం.. రెండు కాళ్లు తొలగింపు..?

అనంతరం సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, గాలివానల కారణంగా జరిగిన పంట నష్టాన్ని వెంటనే క్షేత్రస్థాయిలో అంచనా వేసి, నష్ట వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.

నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన పరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు