Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

రాప్తాడు నిందితుడి పరిస్థితి విషమం.. రెండు కాళ్లు తొలగింపు..?

రాప్తాడు బాలికపై దాడి కేసులో నిందితుడు హేమంత్ పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం.

రాప్తాడు నిందితుడి పరిస్థితి విషమం.. రెండు కాళ్లు తొలగింపు..?

మన సాక్షి, వెబ్ డెస్క్ :

రాప్తాడు బాలికపై దాడి కేసులో నిందితుడు హేమంత్ పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం. పోలీసుల కాల్పుల్లో రెండు కాళ్ల మోకాళ్ల కింది భాగాల్లోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కుడి కాలులో మరో మూడు బుల్లెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు ఇప్పటికే నాలుగు యూనిట్ల రక్తాన్ని ఎక్కించారు. నిందితుడి కాళ్లకు తీవ్రంగా గాయాలు కావడంతో వాటిని తొలగించారనే ప్రచారం కలకలం రేపుతోంది.

స్కూల్లో బాలికపై రంపంతో దాడి.. అడవుల్లోకి పరార్

రాప్తాడులోని ఓ పాఠశాలలో బాలికపై రంపంతో దాడి చేసిన హేమంత్ అనంతరం అక్కడి నుంచి పరారై ఆత్మకూరు అటవీ ప్రాం తంలోకి వెళ్లాడు. నిందితుడి ఆచూకీ గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు వెళ్లగా, పోలీసులపై తిరగబడి దాడికి యత్నించినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు.

మరోవైపు బాధిత బాలికకు చికిత్స కొనసాగుతోంది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని బెంగళూరు లోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాం శంగా మారింది. నిందితుడి ఆరోగ్య పరిస్థితి, శస్త్రచికిత్స ఫలితాలు, బాలిక ఆరోగ్య పురోగతిపై తదుపరి వివరాల కోసం అంద రూ ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి ఆరోగ్యం విషయంలో హెల్త్ బులిటిన్ విడుదలయితేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు