Inter : ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు… ట్రైనింగ్ లోనే నెలకు రూ. 25 వేల వేతనం..!

Inter : ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు… ట్రైనింగ్ లోనే నెలకు రూ. 25 వేల వేతనం..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తెలుగు రాష్ట్రాల వారికి ప్రముఖ కంపెనీ శుభవార్త తెలియజేసింది. టెక్ మహేంద్ర కంపెనీలో ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు అర్హులుగా ప్రకటించింది.

 

ఈ ఉద్యోగానికి ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎలాంటి పరీక్షలు లేకుండా కేవలం వెంటనే ద్వారానే ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు ఆ కంపెనీ పేర్కొన్నది. ఉద్యోగానికి ఎంపికైన వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నది. అంతేకాకుండా శిక్షణ సమయంలోనే 25 వేల వేతనం ఇవ్వనున్నారు.

 

ALSO READ : GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !

 

జాబ్ రోల్, విద్యార్హత :

 

ప్రముఖ టెక్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. టెక్ మహేంద్ర కంపెనీలో ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు ఉంటే సరిపోతుంది. 18 సంవత్సరాలు నిండినవారు దరఖాస్తు చేసుకోవాలి.

 

ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు . ఎంపికైన వారికి శిక్షణ సమయంలో నెలకు 25వేల రూపాయలు జీతం ఇవ్వనున్నారు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే వీరిని ఎంపిక చేయనున్నారు.

 

ALSO READ : Whatsapp Tricks : వాట్సాప్ ట్రిక్స్.. వాడే వాళ్లంతా తెలుసుకోవాల్సిందే..!

 

బాధ్యతలు :

> టెక్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైన వారు కస్టమర్ మద్దతును అందించాలి.

> అర్థం చేసుకునే సామర్థ్యం మరియు ఇతర ప్రశ్నలకు పరిష్కరించగల సామర్థ్యం ఉండాలి.

> అంతర్జాతీయ వాయిస్ ప్రక్రియలో సంబంధిత అనుభవం

> అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

> మంచి కస్టమర్ హ్యాండిల్ నైపుణ్యాలు ఉండాలి.

> షిఫ్టులు వాయిస్ ప్రాసెస్ కోసం సౌకర్యవంతంగా పనిచేయాలి.

> ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారు హైదరాబాద్ / సికింద్రాబాద్ సికింద్రాబాద్ లో ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది.

> వారంలో ఐదు రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది. రెండు రోజులు వీక్లీ ఆఫ్ ఉంటుంది.

> వీక్లీ ఆఫ్ రొటేషన్ విధానంలో ఉంటుంది.

 

ALSO READ : WhatsApp : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్, మాటల్లేవ్ .. ఇక మాట్లాడుకోవడాల్లేవ్..!

 

దరఖాస్తు విధానం :

ఉద్యోగానికి ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టెక్ మహీంద్రా అఫీషియల్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు ఉంటాయి. ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.