Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Alumni : దశాబ్దాలు దాటినా చెదరని స్నేహ బంధం..!

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2003-04 విద్యాసంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం రోజు అత్యంత వేడుకగా జరిగింది .

Alumni : దశాబ్దాలు దాటినా చెదరని స్నేహ బంధం..!

గుర్రంపోడు, మన సాక్షి :

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2003-04 విద్యాసంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం రోజు అత్యంత వేడుకగా జరిగింది . దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ సన్నిధిలోని రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్ ఈ అపూర్వ కలయికకు వేదికైంది.

ఈ సందర్భంగా విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన అలనాటి ఉపాధ్యాయులైన మంచికంటి కృష్ణయ్య, చింతరెడ్డి కృష్ణారెడ్డి, వెంకటేశ్వర గుప్తా, చామకూరి లింగారెడ్డి, ఖలీం, కవిత, వద్దిరెడ్డి నరసింహారెడ్డి, రావుల వెంకటనారాయణ గౌడ్ లను శాలువాలు కప్పి, మెమెంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు. తమ భవిష్యత్తుకు పునాది వేసిన గురువులకు ఈ విధంగా కృతజ్ఞతలు చాటుకున్నారు.

అనంతరం పూర్వ విద్యార్థులంతా తమ పాఠశాల దశలోని తీపి గుర్తులను, మధుర స్మృతులను నెమరువేసుకున్నారు . ప్రస్తుత తమ ఉద్యోగ, వ్యాపారాల వివరాలను, కుటుంబ యోగక్షేమాలను పరస్పరం అడిగి తెలుసుకున్నారు . రోజంతా ఆటపాటలతో, ఉల్లాసభరితమైన వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య గడిపారు.

ఈ వేడుకలో పూర్వ విద్యార్థులు చాడ చక్రవర్తి, కుప్ప మహేష్, ముష్టిపల్లి లింగస్వామి, పర్సనబోయిన వెంకన్న, వెంకన్న, మాదనబోయిన నరసింహ, బొడ్డుపల్లి నరేష్ చారి, మిట్టపల్లి శ్రీనివాస్, పోలేపల్లి ఏడుకొండలు, పోలేపల్లి అంజిబాబు, పోలేపల్లి నాగులు, తూటుపల్లి బిక్షం, నాయక్, షేక్ ఫర్జానా, జ్యోతి, అంజమ్మ, రేపాక శోభారాణి, శ్వేత, బిక్షపమ్మ, మహేశ్వరి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

మరిన్ని వార్తలు