Karimnagar : కరీంనగర్‌లో వైభవంగా బోనాల జాతర..!
కరీంనగర్ నగరంలోని చింతకుంట, రాంనగర్, కిసాన్ నగర్, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో, అలాగే మార్కండేయ నగర్‌లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ, పెద్దమ్మతల్లి బోనాల మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.

Karimnagar : కరీంనగర్‌లో వైభవంగా బోనాల జాతర..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ నగరంలోని చింతకుంట, రాంనగర్, కిసాన్ నగర్, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో, అలాగే మార్కండేయ నగర్‌లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ, పెద్దమ్మతల్లి బోనాల మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ పూజల్లో, రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని మేయర్ భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. అనంతరం భక్తులతో కలిసి బోనాల ఊరేగింపులో పాల్గొని, అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బోనాల పండుగ ప్రజల ఐక్యతకు నిదర్శనమని కొనియాడారు. అమ్మవారి కరుణతో కరీంనగర్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, మున్నూరు కాపు, పద్మశాలి సంఘాల ప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
MOST READ :
- Bullet Train : శంషాబాద్ టు చెన్నై బుల్లెట్ ట్రైన్ రూట్ మార్చొద్దు.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మీదుగానే వెళ్లాలి..!
- Miryalaguda : కొనసాగుతున్న TOSS అడ్మిషన్లు 2026-27.. ఓపెన్ టెన్త్, ఇంటర్లో చేరేందుకు ఇదే మంచి అవకాశం..!
- Almatti: ఆల్మట్టికి భారీ వరద.. చిగురిస్తున్న రైతన్నల ఆశలు..!
- Almatti : కదిలిన కృష్ణమ్మ ఆల్మట్టి డ్యాం గేట్ల ఎత్తివేత.. దిగువకు భారీగా వరద..!










