Almatti: ఆల్మట్టికి భారీ వరద.. చిగురిస్తున్న రైతన్నల ఆశలు..!
కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున కర్ణాటకలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. కీలకమైన ఆల్మట్టి ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది.

Almatti: ఆల్మట్టికి భారీ వరద.. చిగురిస్తున్న రైతన్నల ఆశలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున కర్ణాటకలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. కీలకమైన ఆల్మట్టి ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. ఇదే స్థాయిలో మరో, రెండు మూడు రోజుల్లో వరద కొనసాగితే ప్రాజెక్టు నిండే అవకాశాలు ఉన్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టు నీటి నిల్వ పూర్తిస్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలకు గాను ప్రస్తుతం 107.92 టీఎంసీల నీళ్లు ఉన్నాయి.
అయితే కృష్ణ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని కృష్ణ పరివాహక ప్రాంత రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రాజెక్టులలోకి చుక్కనీరు రాకపోవడంతో నిరాశతో ఉన్న రైతన్నలు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా డ్యాములు నిండే అవకాశం ఉందని ఆశల్లో ఉన్నారు. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆల్మట్టి డ్యాంకు 92 టీఎంసీల నీళ్లు వచ్చి చేరాయి. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం కు 65, 752 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 38,067 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో నారాయణపూర్ జలాశయంలోకి వరద ప్రవాహం కూడా కొనసాగుతుంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు 33405 క్యూసెక్కుల వరద చేరుతుండగా ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలకు గాను ప్రస్తుతం 28.06 టిఎంసిల నీళ్లు ఉన్నాయి.
అదేవిధంగా తుంగభద్ర ప్రాజెక్టులోకి కూడా వరద ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టుకు 21 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా ఆ ప్రాజెక్టు సామర్థ్యం 105.79 టీఎంసీలకు గాను ప్రస్తుతం 28 టీఎంసీల నీరు ఉంది. తుంగభద్ర మినహా కర్ణాటకలోని ప్రాజెక్టులన్ని మరో రెండు, మూడు రోజుల్లో నిండనున్నాయి. అయితే ఆగస్టు మొదటి వారంలో భారీ వర్షాలు కురిస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరకు వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్ లో 137 టీఎంసీలు శ్రీశైలంలో 41 టీఎంసీల నీరు ఉంది. నాగార్జునసాగర్, శ్రీశైలంలోకి కేవలం నామ మాత్రపు ప్రవాహం వచ్చి చేరుతుంది.
MOST READ :
- Nalgonda : తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా వాసులు మృతి..!
- Almatti : ఆల్మట్టిలోకి చేరుతున్న వరద.. 12,500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల..!
- Miryalaguda : రైతులు ఈ పంటలు మాత్రమే సాగు చేయాలి.. వ్యవసాయ అధికారుల సూచనలు..!
- Almatti : కృష్ణ బేసిన్ లో వర్షాలు.. ఆల్మట్టిలోకి 40,173 క్యూసెక్కుల వరద..!









