Almatti : ఆల్మట్టిలోకి చేరుతున్న వరద.. 12,500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల..!
కృష్ణ బేసిన్ లో కురుస్తున్న వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఆల్మట్టి డ్యామ్ లోకి వరద నీరు నిలకడగా ఉంది.

Almatti : ఆల్మట్టిలోకి చేరుతున్న వరద.. 12,500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
కృష్ణ బేసిన్ లో కురుస్తున్న వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఆల్మట్టి డ్యామ్ లోకి వరద నీరు నిలకడగా ఉంది. ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 123.081 టిఎంసిలకు గాను ప్రస్తుతం 97. 277 టీఎంసీల నీరు ఉంది. సుమారుగా 80% నీరు నిండింది.
ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ లోకి 46,848 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వచ్చి చేరుతుండగా 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా నారాయణపూర్ డ్యామ్ లోకి 14,428 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 8209 క్యూసెక్కుల నీటిని దిగువకి వదులుతున్నారు. తుంగభద్ర జలాశయానికి 3667 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 3254 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
జూరాల ప్రాజెక్టుకు కేవలం 32 కుసేక్కుల నీరు మాత్రమే వస్తుంది. అంతే మొత్తాన్ని కాలువలకు వదులుతున్నారు. కాగా శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇప్పటివరకు చుక్కనీరు రావడం లేదు. ఎగువ నుంచి నాగార్జునసాగర్ డ్యామ్ లోకి 900 కేసులు నీరు వస్తుండగా ఎస్ఎల్బీసీ ద్వారా అంతే మొత్తాన్ని విడుదల చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- Karimnagar : కరీంనగర్లో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. దంపతులను బంధించి భారీ దోపిడీ..!
- Pocso Case : నల్గొండ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. అరెస్ట్..!
- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యయత్నానికి ముందు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందేమిటి..!
- అర్ధరాత్రి నగ్నంగా పరుగులు.. కొద్దిసేపటికే శవమై తేలిన యువతి..!









