Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కీలక సూచన.. రాష్ట్రంలోనే మిర్యాలగూడను ప్రథమ స్థానంలో నిలిపాలి..!

సర్ ప్రక్రియలో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని రాష్ట్రస్థాయిలోనే మొదటి స్థానంలో నిలపాలని మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి కోరారు.

Miryalaguda : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కీలక సూచన.. రాష్ట్రంలోనే మిర్యాలగూడను ప్రథమ స్థానంలో నిలిపాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

సర్ ప్రక్రియలో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని రాష్ట్రస్థాయిలోనే మొదటి స్థానంలో నిలపాలని మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి కోరారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ సర్ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ షబ్బీర్ అలీ సమక్షంలో నిర్వహించడం జరిగింది.

మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, వార్డ్ ఇన్‌చార్జ్‌లు, బూత్ లెవల్ ఏజెంట్లుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సర్ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే అత్యంత కీలకమైన ప్రక్రియ అని అన్నారు.

అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు కావడంతో పాటు, ఎలాంటి తప్పులు, లోపాలు లేకుండా ఓటరు జాబితాను రూపొందించడంలో పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు సర్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. సర్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ సమన్వయంతో, అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత, నియోజకవర్గ ఇన్‌చార్జ్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, పార్టీ శ్రేణులు బూత్ స్థాయి నుంచి సమర్థవంతంగా పనిచేసి నిర్ణీత గడువులోగా సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి రాష్ట్రంలో మిర్యాలగూడకు ఆదర్శ స్థానాన్ని తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ కౌన్సిలర్లు, వార్డ్ ఇన్‌చార్జ్‌లు, బూత్ లెవల్ ఏజెంట్లు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు