Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

గుంతల రహదారి.. అధికారుల నిర్లక్ష్యం..?

కరీంనగర్ నుంచి వేములవాడ వెళ్లే ప్రధాన రహదారిలో బావుపేట వద్ద రోడ్డు భారీ గుంతలతో అస్తవ్యస్తంగా మారి ప్రమాదకరంగా ఉందని సామాజిక కార్యకర్తలు సామాజిక కార్యకర్తలు కోట శ్యాం కుమార్, బెల్లపు కరుణాకర్ ఆందోళన వ్యక్తం చేశారు.

గుంతల రహదారి.. అధికారుల నిర్లక్ష్యం..?

కరీంనగర్ బ్యూరో , మనసాక్షి :

కరీంనగర్ నుంచి వేములవాడ వెళ్లే ప్రధాన రహదారిలో బావుపేట వద్ద రోడ్డు భారీ గుంతలతో అస్తవ్యస్తంగా మారి ప్రమాదకరంగా ఉందని సామాజిక కార్యకర్తలు సామాజిక కార్యకర్తలు కోట శ్యాం కుమార్, బెల్లపు కరుణాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

గత కొన్నేళ్లుగా రహదారి సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రమాదాలు జరిగి పలువురు గాయపడుతున్నారని ఆరోపించారు. బావుపేట వద్ద రహదారి అధ్వాన స్థితిపై, మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత రోడ్లు, భవనాల శాఖ ఈఈ, ఏఈఈ, డీఈఈ, ఎస్‌ఈ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సంబంధిత ఇన్‌స్పెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రమాదాలు జరగకముందే రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వారు కోరారు.

MOST READ 

మరిన్ని వార్తలు