అజోల్లా సాగుతో ప్రయోజనాలు.. రైతులకు అవగాహన..!
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో సి హెచ్ ఎస్ డి సెయింట్ థెరిస్సా కాలేజ్ ఫర్ ఉమెన్, ఏలూరు విద్యార్థినులు, శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం ( కె వి కె ), గడ్డిపల్లి ఆధ్వర్యంలో రూరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ (RAWEP)లో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అజోల్లా సాగుతో ప్రయోజనాలు.. రైతులకు అవగాహన..!
గరిడేపల్లి, మనసాక్షి
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో సి హెచ్ ఎస్ డి సెయింట్ థెరిస్సా కాలేజ్ ఫర్ ఉమెన్, ఏలూరు విద్యార్థినులు, శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం ( కె వి కె ), గడ్డిపల్లి ఆధ్వర్యంలో రూరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ (RAWEP)లో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అజోల్లా సాగు, దాని ఉపయోగాలు మరియు వ్యవసాయంలో దాని ప్రాధాన్యత గురించి రైతులకు వివరించారు. అజోల్లాను వరి వంటి పంటల్లో సేంద్రియ నత్రజని వనరుగా, జీవ ఎరువుగా ఉపయోగించడం ద్వారా నేల సారాన్ని మెరుగుపరచడంతో పాటు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చని విద్యార్థినులు వివరించారు. అలాగే పశువులకు అజోల్లాను పోషకాహారంగా ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా తెలియజేశారు.
RAWEPలో భాగంగా విద్యార్థినులు కీతవారిగూడెం గ్రామంలో రైతులతో ప్రత్యక్షంగా మమేకమై ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ వ్యవసాయం, పంటల నిర్వహణ మరియు రైతులకు ఉపయోగపడే నూతన సాంకేతికతలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడటం, రైతుల్లో అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.