Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లావిద్య

నారాయణపేట్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..!

భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నారాయణపేట జిల్లాలో ఘనంగా నిర్వహించారు.

నారాయణపేట్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..!

68 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం.

రాష్ట్ర స్థాయి పురస్కార గ్రహీతలకు ప్రత్యేక అభినందనలు.

నారాయణపేటటౌన్, మనసాక్షి:-

భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నారాయణపేట జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ బాంకెట్ హాల్లో శనివారం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యారంగానికి విశిష్ట సేవలందిస్తూ, విద్యార్థుల అభ్యసన ఫలితాల మెరుగుదలకు అంకితభావంతో కృషి చేస్తున్న 68 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఆర్ఓ రాజేశ్వరి హాజరై మాట్లాడుతూ సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఉపాధ్యాయ వృత్తి గొప్పతనానికి ప్రతీక అని అన్నారు.
భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా, దేశ ప్రథమ పౌరుడిగా అత్యున్నత పదవిని అలంకరించినప్పటికీ, డాక్టర్ రాధాకృష్ణన్ తాను ఒక ఉపాధ్యాయుడిగా గుర్తించ బడటానికే అత్యంత గర్వపడేవారని తెలిపారు. ఆయన జీవితం ఉపాధ్యాయ వృత్తి యొక్క గౌరవానికి, విలువకు గొప్ప నిదర్శనమని పేర్కొన్నారు.

“గురుర్ బ్రహ్మా, గురుర్ విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరబ్రహ్మ” అంటూ భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం కల్పించార ని గుర్తుచేశారు. ఉపాధ్యాయుడు కేవలం పాఠ్యాంశాలను బోధించే వ్యక్తి మాత్రమే కాదని, విద్యార్థుల్లో జ్ఞానం, విలువలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతలను పెంపొందిస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గదర్శి అని అన్నారు.

రాష్ట్ర స్థాయి పురస్కారాలు జిల్లాకు గర్వకారణం ::

నారాయణపేట జిల్లా నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న డీఈవోడా. గోవిందరాజు ను జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసే ప్రక్రియలో ఆయనకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడం నారాయణపేట జిల్లాకు గర్వకారణమని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న ఎస్. భాగ్యలక్ష్మి, స్వేతా రెడ్డిలను కూడా ప్రత్యేకంగా అభినందించారు.

వారి సేవా స్ఫూర్తి జిల్లాలోని ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. జిల్లాలో విద్యారంగ అభివృద్ధి కోసం అధికారులు, ఉపాధ్యాయులు చేస్తున్న సమిష్టి కృషిని ఆమె అభినందించారు. గత మూడు సంవత్సరాల్లో విద్యార్థుల అభ్యసన ఫలితాల్లో గణనీయమైన పురోగతి సాధించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను మరింత పెంచడంతో పాటు, పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచి, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా అందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. “ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి జీవితాన్నే కాదు… ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలడు” అని పేర్కొంటూ, 68 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ALSO READ : నల్గొండ జిల్లాలో ఘోరం.. పంది కూర వండలేదని భార్యను చంపిన భర్త..! 

జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ విజయకుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, వారి నిస్వార్థ సేవలు సమాజానికి అమూల్యమైనవని అన్నారు.

మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేతా యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణను అందిస్తూ వారి భవిష్యత్తును నిర్మిస్తున్న ఉపాధ్యాయుల సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చైర్మన్ సదాశివ రెడ్డి మాట్లాడుతూ, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన ప్రతి ఉపాధ్యాయుడు తన సేవా స్ఫూర్తితో మరెందరో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు

ఈ సందర్భంగా జిల్లాలో వివిధ పాఠశాలల్లో విశిష్ట సేవలు అందించిన మొత్తం 68 మంది ఉత్తమ ఉపాధ్యాయులను పురస్కారాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.
కార్యక్రమంలో ఏ ఎం ఓ విద్యాసాగర్, డీఎస్ఓ భాను ప్రకాష్, ఎస్ ఓలు రాజేంద్ర కుమార్, యాదయ్య శెట్టి, సాయినాథ్, నాగార్జున రెడ్డి, ఎంఈఓలు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు