Miryalaguda : మిర్యాలగూడలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం..!
మిర్యాలగూడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ హాజరయ్యారు.

Miryalaguda : మిర్యాలగూడలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఉపాధ్యాయులతో కలిసి జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను కొనియాడారు. “గురుర్ బ్రహ్మా, గురుర్ విష్ణుః, గురుర్ దేవో మహేశ్వరః” అనే శ్లోకాన్ని ప్రస్తావిస్తూ, గురువు దేవుడితో సమానమని, విద్యార్థులకు జ్ఞానాన్ని అందించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ ధర్మనాయక్, హెడ్మాస్టర్ లాలునాయక్, ఉపాధ్యాయులు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, 5వ వార్డు ఇన్చార్జి కేతావత్ జవహర్ నాయక్, కాంగ్రెస్ నాయకులు కొమ్ము దాసు, కొండా లక్ష్మణ్, ప్రవీణ్, బొంగర్ల వినోద్, వేణు, సైదులు, అభి, శివ, దైద, సురేష్ తదితరులు పాల్గొన్నారు.










