Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

నల్గొండ జిల్లాలో ఇంజక్షన్‌ ఆర్డర్ ఉన్నా.. భూమి యజమాని పై దాడులు..!

చింతపల్లి మండల పరిధిలోని గోడకొండ్ల మాల్ వెంకటేశ్వర్ నగర్ పరిధిలోని సర్వే నంబర్ 117లో ఉన్న 6 ఎకరాల 27 గుంటల భూమికి సంబంధించి వివాదం కొనసాగుతోందని, భూమి యజమాని జక్కా రామ్‌రెడ్డి తెలిపారు.

నల్గొండ జిల్లాలో ఇంజక్షన్‌ ఆర్డర్ ఉన్నా.. భూమి యజమాని పై దాడులు..!

న్యాయం చేయాలని జక్కా రామ్‌రెడ్డి వేడుకోలు

చింతపల్లి, మనసాక్షి…

చింతపల్లి మండల పరిధిలోని గోడకొండ్ల మాల్ వెంకటేశ్వర్ నగర్ పరిధిలోని సర్వే నంబర్ 117లో ఉన్న 6 ఎకరాల 27 గుంటల భూమికి సంబంధించి వివాదం కొనసాగుతోందని, భూమి యజమాని జక్కా రామ్‌రెడ్డి తెలిపారు. ఈ భూమిని ఫిబ్రవరి 3 .2025 కొందూరు జగన్మోహన్ వద్ద కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జక్కా రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. కొంతమంది స్థానిక వ్యక్తులు కావాలని తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు ఈ భూ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దేవరకొండ కోర్టు నుంచి ఇంజక్ష స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ, కొంతమంది వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మహిళలను సైతం చూడకుండా రాళ్లతో దాడి చేసినట్లు తెలిపారు. దీంతో తమకు భద్రత లేకుండా పోయిందని, భూమి విషయంలో చట్టపరమైన పరిష్కారం వచ్చే వరకు శాంతిభద్రతలు కాపాడాలని కోరారు.

భూమికి సంబంధించిన పత్రాలు, కోర్టు ఆదేశాలను అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జక్కా రామ్‌రెడ్డి కోరారు. ఈ వివాదంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయడంతో పాటు, దాడులకు పాల్పడుతున్న వారిపై విచారణ జరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు