Suryapet : పిల్లలమర్రి దేవాలయాలను సందర్శించిన ఇన్టాక్ కేంద్ర కమిటీ సభ్యులు..!
ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటజ్ కేంద్ర కమిటీ సభ్యులు మణికొండ వేదకుమార్ నల్లగొండ జిల్లా సభ్యులు పెద్దిరెడ్డి గణేష్ తో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని పిల్లలమర్రి దేవాలయాలను ఆదివారం సందర్శించారు.పిల్లలమర్రి గ్రామంలోని దాదాపు వెయ్యి సంవత్సరాల పురాతన దేవాలయాలు ఎరుకేశ్వర ఆలయం, త్రికూటేశ్వర ఆలయాలు అక్కడ ఉన్న చారిత్రిక ఆనవాళ్లు శాసనాలను పరిశీలించారు.

సూర్యాపేట, మనసాక్షి :

జిల్లా సభ్యులు పెద్దిరెడ్డి గణేష్ అందించిన చరిత్ర వివరాలను అక్కడున్న శిల్ప సంపదతో సరిపోల్చి ముగ్ధులయ్యారు. త్వరలో పిల్లలమర్రి దేవాలయాల గురించి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మించి ఢిల్లీ సంస్థకు అందిస్తానని అన్నారు.తద్వారా కేంద్ర,రాష్ట్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా నిధులు సాధించి ఇటువంటి గొప్ప జాతీయ సంపదలను కాపాడి ముందు తరాలకు అందించవచ్చని చెప్పారు.అంతకు ముందు జిల్లా కేంద్రంలోని సుధా బ్యాంక్ వద్ద వేదకుమార్ కి ఇంటాక్ సభ్యులు భోనగిరి భాస్కర్,ధనంజయ తదితరులు ఘన స్వాగతం పలికారు.