Whatsapp Tricks : వాట్సాప్ ట్రిక్స్.. వాడే వాళ్లంతా తెలుసుకోవాల్సిందే..!

Whatsapp Tricks : వాట్సాప్ ట్రిక్స్.. వాడే వాళ్లంతా తెలుసుకోవాల్సిందే..!

మనసాక్షి , వెబ్ డిస్క్ :

స్మార్ట్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ యాప్ ను వినియోగిస్తుంటారు. ప్రతి ఒక్కరు వాట్సాప్ ద్వారా ఫోటోలు, వీడియోలు , ఇతర సమాచారం పంపడానికి చాలా సింపుల్ గా వాట్సప్ ఉపయోగిస్తుంటారు. సమాచారం త్వరగా తెలియజేయడానికి ఎక్కువమంది ఉపయోగించే యాప్ లలో వాట్సాప్ కు ఆదరణ ఎక్కువగా ఉంది.

వాట్సప్ వినియోగంలో అనేక ట్రిక్స్ ఉన్నాయి. వాట్సాప్ యూజర్లు ట్రిక్స్ తెలుసుకుని వాట్సప్ ను మరింత మెరుగ్గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీనిని వాట్సప్ యూజర్లు తెలుసుకుంటే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

 

ALSO READ : Gpay : గూగుల్ పే కొత్త ఫీచర్…. డెబిట్ కార్డు తో పనిలేదు.. ఆధార్ కార్డు ఉంటే చాలు..!

 

వాట్సాప్ స్టేటస్ చూసినట్లు తెలియకుండా ఉండాలంటే :

నిద్ర నుంచి లేవగానే వాట్సప్ ఓపెన్ చేయడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. అందులో ముఖ్యంగా స్టేటస్ లు కూడా చూస్తుంటారు. కొన్నింటికి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. చూడగానే రిప్లై ఇవ్వకుంటే అవతలి వ్యక్తులు రిప్లై ఇవ్వలేదని అనుకోవడం సర్వసాధారణంగా మారుతుంది.

 

అలాంటప్పుడు స్టేటస్ చూసినట్లు ఎదుటి వ్యక్తికి తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి..? అది ఎలా అంటే ? వాట్సప్ సెట్టింగ్ లోకి వెళ్లి ఎకౌంట్ ఆప్షన్ ఓపెన్ చేయాలి.

 

దానిలో ప్రైవసీపై క్లిక్ చేయగానే రీడర్ రిసిప్ట్ అని ఆప్షన్ వస్తుంది . దానిని డిసేబుల్ చేసిన తర్వాత స్టేటస్ చూడొచ్చు. అప్పుడు మనం స్టేటస్ చూసినట్లు ఎదుటి వ్యక్తికి తెలియకుండా ఉంటుంది. ఈ ఫీచర్ డిసేబుల్ చేయడం వల్ల మీ స్టేటస్ కూడా ఎవరు చూశారో తెలుసుకోలేరు.

 

రీడర్ రిక్వెస్ట్ డిసేబుల్ చేయడం ద్వారా అవతలి వ్యక్తి పంపిన మెసేజ్ మీరు చూసిన విషయం కూడా వారికి తెలియదు. అలాగే మీరు పంపిన మెసేజ్ కూడా అవతలి వ్యక్తి చూశాడో లేదో ..? కూడా మనం తెలుసుకోలేము.

 

వెబ్ లాగిన్ మర్చిపోతే :

వెబ్ లాగిన్ చాలామంది ఆఫీసుకు వెళ్ళగానే వాట్సాప్ ను కంప్యూటర్ , ల్యాప్ టాప్ లలో వెబ్ లాగిన్ అవుతుంటారు. అలాంటప్పుడు కంప్యూటర్ క్లోజ్ చేయగానే ఇంటికి వెళ్లే టైం లో లాగిన్ మర్చిపోయామని కంగారు పడుతుంటారు. అలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు.

 

ALSO READ : ATM CARD | ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా .. బ్యాంకు కొత్త సర్వీస్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!

 

మొబైల్ లోని వాట్సప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి వాట్సాప్ వెబ్ ఆప్షన్ కు క్లిక్ చేయాలి. దానిలో మనం ఏ కంప్యూటర్ లో లాగిన్ అయ్యామో లిస్టు ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే లాగౌట్ ఆప్షన్ వస్తుంది. అప్పుడు వాట్స్అప్ వెబ్ నుంచి లాగౌట్ అయిపోతారు.

నెంబర్ సేవ్ చేయకుండా జిరాక్స్ కోసం పంపడం ఎలా ..?

వాట్సాప్ లో ఉన్న ఫోటోలను మనం జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఆ జిరాక్స్ సెంటర్ నెంబర్ ను ఫోన్లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా నెంబర్ ఫోన్లో ఫీడ్ చేయకుండా మన డాక్యుమెంట్లు ఎలా పంపాలంటే ట్రిక్కు ఉంది.

 

అదేంటంటే ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి https:/api.whatsapp.com/send? ఫోన్ నెంబర్ టైప్ చేయాలి. అనంతరం వాట్సప్ లోకి రీ డైరెక్టు అవుతుంది. అక్కడి నుంచి ఆ నెంబర్ కు డాక్యుమెంట్లు పంపొచ్చు. దీనివల్ల వాట్సాప్ ను స్మార్ట్ గా వాడుకుని అవకాశం ఉంది.

 

వాట్సప్ ఓపెన్ చేయకుండా మెసేజ్ చదవడం ఎలా ..?

వాట్సప్ ఓపెన్ చేయకుండానే మీకు వచ్చిన మెసేజ్ మొత్తం చదవచ్చు. కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి వచ్చిన మెసేజ్ పై కర్సర్ ఉంచాలి. అలా కొద్దిసేపు ఉంచితే మీకు వచ్చిన మెసేజ్ మొత్తం పాప్ అప్ రూపంలో తెలుస్తుంది. మనం దానిని చదివినట్లు వాళ్లకు తెలియదు.

 

కావలసిన మెసేజ్ వెతుక్కోవడం ఈజీ :

వాట్సప్ ఓపెన్ చేయగానే అనేక మెసేజ్ లు వస్తుంటాయి. మనకు కావలసిన మెసేజ్ ని వెతుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే కొత్త ఫీచర్ ఉపయోగించి మీరు వెంటనే మీకు కావలసిన మెసేజ్ ని చదవచ్చు. అదే స్టార్డ్ మెసేజెస్ ఫీచర్ . ఏదైనా మెసేజ్ వద్ద కనిపించే స్టార్ బటన్ పై క్లిక్ చేస్తే అది స్టార్డ్ మెసేజ్ లోకి వెళుతుంది.

 

ALSO READ : Rythu Runa Mafi : రుణమాఫీ పై కేసీఆర్ కీలక ప్రకటన అప్పుడేనా..?

 

సెట్టింగ్స్ లోని స్టార్ట్ మెసేజ్ లోకి వెళ్లి ఎప్పుడు కావాలంటే అప్పుడు మెసేజ్ ని చదువుకోవచ్చు. మొబైల్ స్టోరేజ్ సరిపోకపోతే స్టోరేజ్ స్పేస్ రన్నింగ్ అవుట్ అనే మెసేజ్ వస్తూ ఉంటుంది. వాట్సాప్ లో కూడా ఎక్కువ స్టోరేజీ ఉన్నవి తొలగించొచ్చు.

 

టైప్ చేయకుండానే మెసేజ్ పంపొచ్చు :

వాట్సాప్ లో టైప్ చేయకుండానే మెసేజ్ పంపొచ్చు. దీనికోసం మనం ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆండ్రాయిడ్ ఫోన్ లొ అయితే గూగుల్ అసిస్టెంట్, ఐఫోన్ లో అయితే సిరి యాప్ ను యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏం పంపాలో దానిలో రికార్డు చేసి ఎవరికి పంపాలో కూడా పంపొచ్చు.

 

ఎక్కువ మంది చదివిన న్యూస్… మీరు కూడా చదవాలంటే క్లిక్ చేయండి.. 👇

1. Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!

2. Gruhalaxmi : సొంత స్థలం ఉంటే తెలంగాణ గృహలక్ష్మి పథకం.. రూ. 3 లక్షలు ఇలా పొందండి..!

3. Rythu Bandhu : రైతు బంధు కోసం .. ఆ రైతులు ఇలా చేయాలి..!

4. RBI : రూ. 500 నోట్లపై ఆర్ బీ ఐ కీలక ప్రకటన..!

5. ATM CARD | ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా .. బ్యాంకు కొత్త సర్వీస్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!