Gpay : గూగుల్ పే కొత్త ఫీచర్…. డెబిట్ కార్డు తో పనిలేదు.. ఆధార్ కార్డు ఉంటే చాలు..!

Gpay : గూగుల్ పే కొత్త ఫీచర్…. డెబిట్ కార్డు తో పనిలేదు.. ఆధార్ కార్డు ఉంటే చాలు..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

గూగుల్ పే వాడకం దారులు రోజురోజుకు పెరుగుతున్నారు. పది రూపాయల నుంచి వేలాది రూపాయల వరకు పేమెంట్స్ గూగుల్ పే ద్వారా చేస్తున్నారు. ఇటీవల గూగుల్ పే వినియోగదారులకు ఒక శుభవార్త తెలియజేసింది.

 

ఇంతకుముందు గూగుల్ పే వారికి యూపీఐ కోసం బ్యాంక్ డెబిట్ కార్డును ఉపయోగించాల్సి ఉండేది . కానీ డెబిట్ కార్డుతో పని లేకుండా కేవలం ఆధార్ కార్డు తోనే యూపీఐ పేమెంట్ చేసే విధంగా కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ALSO READ : Good News : వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సహాయం.. ! దరఖాస్తు చేసుకోండిలా…!

ఆధార్ కార్డుతో యూపీఐ చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కు యూజర్లు గూగుల్ పే యాప్ తో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. గూగుల్ పే ద్వారా పేమెంట్స్ చేయటం.

 

డెబిట్ కార్డు అవసరం లేదు :

గూగుల్ పే యూజర్లు డెబిట్ కార్డుతో అవసరం లేకుండా ఆధార్ కార్డు తో యూపీఐ పిన్ నెంబర్ ని సెట్ చేసుకోవచ్చు. యూపీఐ ఐడి లను సెటప్ చేసుకునేందుకు డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది.

 

ఆధార్ కార్డుతో యూపీఐ పేమెంట్ అవకాశం ప్రస్తుతం కొన్ని బ్యాంకులకు మాత్రమే అవకాశం కల్పించింది. త్వరలో మరికొన్ని బ్యాంకులు కూడా ఈ సదుపాయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది.

 

ALSO READ : Mahesh Babu : మహేష్ బాబు కొత్త సినిమా లో మాస్ లుక్.. వేసుకున్న షర్ట్ ఖరీదు ఎంతో తెలుసా..?

 

ఆధార్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులను వినియోగించుకోవాలంటే బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేయడంతో పాటు ఫోన్ నెంబర్ కూడా అనుసంధానం చేసి ఉండాలి. గూగుల్ వినియోగదారులు లావాదేవీలు చేయడానికి , బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చును.

 

నమోదు ప్రక్రియ : 

ఆధార్ ద్వారా గూగుల్ పే వినియోగదారులు నమోదు ప్రక్రియను చేయడానికి ఆధార్ నెంబర్ లోని మొదటి ఆరు అంకెలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ దశ పూర్తి చేయడానికి ఆధార్ (యు ఐ డి ఏ ఐ) బ్యాంకు నుంచి వచ్చిన ఓటీపీలను నమోదు చేయాలి. తర్వాత ప్రక్రియను బ్యాంకు పూర్తి చేస్తుంది. యూపీఐ పిన్ నెంబర్ ని సెట్ చేసుకోవచ్చు.