Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్ఆర్ వినూత్న కార్యక్రమం.. జనం మాట- పల్లె బాట కు శ్రీకారం..!

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారమే ధ్యేయంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలుపెట్టారు. ఆదివారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో ‘జనం మాట-పల్లెబాట’ అనే వినూతన కార్యక్రమానికి అధికారికంగా శ్రీకారం చుట్టారు.

Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్ఆర్ వినూత్న కార్యక్రమం.. జనం మాట- పల్లె బాట కు శ్రీకారం..!

– ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎమ్మెల్సీ

మిర్యాలగూడ/వేములపల్లి, మన సాక్షి:

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారమే ధ్యేయంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలుపెట్టారు. ఆదివారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో ‘జనం మాట-పల్లెబాట’ అనే వినూతన కార్యక్రమానికి అధికారికంగా శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని డిజైన్ చేశారు.

ఇందులో భాగంగా నియోజకవర్గంలో ప్రతి వారం రోజులలో ఐదు రోజుల పాటు ఎమ్మెల్యే స్వయంగా పల్లెనిద్ర చేసి పర్యటించనున్నారు.ఆమనగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ‘జనం మాట-పల్లెబాట’ అధికారిక పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఆర్డీవో రమణారెడ్డి, డిఎస్పి రాజశేఖర్ రాజుతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన 14 ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. సొంతింటి కల నెరవేరిన లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వ్యక్తమైంది.కార్యక్రమంలో భాగంగా మొదటి రోజే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆమనగల్లు గ్రామంలో రాత్రి బస చేశారు.

అధికారులతో కలిసి ‘పల్లెనిద్ర’ చేస్తూ, రాత్రి సమయంలో గ్రామస్తులతో సుదీర్ఘంగా ముచ్చటించారు. వీధి వీధినా తిరుగుతూ తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, రోడ్ల వంటి స్థానిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధి స్వయంగా తమ గ్రామానికి వచ్చి రాత్రి వేళల్లో సమస్యలు వినడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, ప్రజల కష్టసుఖాలను నేరుగా క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికే ఈ ‘జనం మాట-పల్లెబాట’ ను ప్రారంభించామన్నారు.

వారంలో ఐదు రోజులు మీ మధ్యే ఉంటా :

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు పనిచేస్తామన్నారు. పల్లెనిద్ర ద్వారా సేకరించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ పి.ఎన్.డి ప్రసాద్, తహసీల్దార్ హేమలత, ఎంపీడీవో జితేందర్ రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పిసిసి సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలి కాంతరెడ్డి,

సర్పంచులు పిల్లల సందీప్, ఎలికంటి భరత్, నారబోయిన సతీష్, ఉప సర్పంచులు షాలెం రాజు, గంట స్వాతి నరసయ్య,ఓబీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ దేశబోయిన రవికుమార్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంటు చొక్కయ్య గౌడ్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పత్తిపాటి స్వరాజ్యలక్ష్మి, టీవీటీ ఫౌండేషన్ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు, శ్రీరామలింగేశ్వర దేవాలయ చైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్, తిరుపతమ్మ దేవాలయ నిర్మాణకర్త ఎలగపల్లి వెంకటేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు