Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు.. జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయంతో వృద్ధులకు న్యాయం..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో వృద్ధ తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ సంచల నిర్ణయం తీసుకొని న్యాయం చేశారు.

Miryalaguda : వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు.. జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయంతో వృద్ధులకు న్యాయం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో వృద్ధ తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ సంచల నిర్ణయం తీసుకొని న్యాయం చేశారు. వృద్ధాప్యంలో ఉన్న వారిని కన్న కొడుకు పట్టించుకోక పోగా వారి ఇంటిని వారికే కేటాయించి న్యాయం చేశారు. వివరాల ప్రకారం..

మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఇంజం చంద్రకళ భర్త రమణారెడ్డి 70 సం.. వయోవృద్ధులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారికి విద్యాభ్యాసం, పెళ్లిళ్లు బాధ్యతలు అన్ని నిర్వర్తించడం జరిగింది. వారికి వ్యవసాయ భూమి సూర్యాపేట జిల్లా
నేరేడుచర్ల మండలం ఇంజంవారిగూడెం
లో కలదు. వీరికి ఒక నివాసము మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని కలదు.

కాగా వారి పేరు మీద ఉన్నటువంటి ఇంటిలో కుమారుడు గత ఐదేళ్లగా నివాసం ఉంటూ తల్లిదండ్రులను రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అనారోగ్య సమస్యలతో పక్షవాతం, మోకాళ్ళ ఆపరేషన్ అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఆర్డిఓ ట్రిబ్యునల్, అప్పిలేట్ ట్రిబ్యునల్ ని సీనియర్ సిటిజెన్స్ చట్టాన్ని ఆశ్రయించారు. వయోవృద్ధుల చట్టం 2007 అనుసరించి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గత నెల 15వ తేదీన వారికి ఇళ్ళు స్వాధీనపరచాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ఇట్టి ఉత్తర్వులను అమలు పరచవలసిందిగా స్థానిక ఆర్డిఓ ఎస్ రమణారెడ్డి, వివిధ డిపార్ట్మెంట్ల సమన్వయంతో జరపాలని మే 23వ తేదీ న ఉత్తర్వులు ఇవ్వడంతో శనివారం ఉత్తర్వుల అమలులో భాగంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజా రెడ్డి, స్థానిక సీఐ నాగభూషణం, తాసిల్దార్ సిబ్బంది, రెవిన్యూ, మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల శాఖ అందరు కలిసి ఆ వయోవృద్ధులని వారి ఇంటిలో ఉంచడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సైదులు, అనిల్ కుమార్, గోపమ్మ, మున్సిపల్ సిబ్బంది సాజిద్, సాంబయ్య, రెవిన్యూ శాఖ నుండి సిబ్బంది, సిడిపిఓ కార్యాలయం నుండి రాములు, నాగిరెడ్డి, నవీన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కకూడా చదవండి : 

మరిన్ని వార్తలు