Karimnagar : చికిత్స పొందుతూ మూడు నెలల పసికందు మృతి.. న్యాయం కోసం ఆసుపత్రి ఎదుట ఆందోళన..!
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యం వికటించి మూడు నెలల చిన్నారి ప్రాణం గాల్లో కలిసిందని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తూ హాస్పిటల్ లో ఆందోళన చేశారు.

Karimnagar : చికిత్స పొందుతూ మూడు నెలల పసికందు మృతి.. న్యాయం కోసం ఆసుపత్రి ఎదుట ఆందోళన..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యం వికటించి మూడు నెలల చిన్నారి ప్రాణం గాల్లో కలిసిందని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తూ హాస్పిటల్ లో ఆందోళన చేశారు.
వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన ఎలాబోయిన వెంకటేష్ -వర్షిత దంపతులకు జన్మించిన మూడు నెలల బాబు మంగళవారం ఉదయం బాగా ఏడుస్తున్నాడని చికిత్స కోసం కరీంనగర్ లోని ఓ నర్సింగ్ హోమ్ పిల్లల ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తెలిపారు.
వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ రమేష్ బాబు చెవి నొప్పితో ఏడుస్తున్నాడని, అడ్మిట్ కావాలని బాబు తల్లిదండ్రులకు సూచించారు. తమ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న వైద్యులు బాబు చెవిలో డ్రాప్స్ వేసి సెలెన్ బాటిల్ పెట్టి, కడుపు నొప్పితో బాబు బాధపడుతున్నాడేమోనని స్కానింగ్ కూడా తీసినట్లు బాబు తల్లిదండ్రులు తెలిపారు. అయినా మరుసటి రోజు బుధవారం కూడా బాబు ఏడుపు ఎంతకు ఆపడం లేదంటు కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందికి తెలుపగ వైద్యలు నిర్లక్ష్యంగా వచ్చి చూసే లోపే బాబు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు.
వైద్యులు అందుబాటులో లేకపోవడంతోనే తమ బాబు మృతి చెందడంటూ కుటుంబ సభ్యులు బంధువులతో కలసి హాస్పిటల్ ఎదుట బైటయించి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపు చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ పలు సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.