Good News : వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సహాయం.. ! దరఖాస్తు చేసుకోండిలా…!

Good News : వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సహాయం.. ! దరఖాస్తు చేసుకోండిలా…!
మన సాక్షి వెబ్ డెస్క్:
తెలంగాణ ప్రభుత్వం కులవృత్తుల, చేతివృత్తుల వారికి గుడ్ న్యూస్ చెప్పింది. కులవృత్తులు, చేతివృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆర్థిక సహాయం అందజేయనున్నది.
ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన https://tsobmmsbc.cgg.gov.in వెబ్ సైట్ ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ALSO READ : Wifi : మీ వైఫై రూటర్ 24 గంటలు ఆన్ లోనే ఉంచుతున్నారా..? అయితే ఇది చూడాల్సిందే ..!
ఫోటో, ఆధార్ కార్డ్, కుల దృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
కులవృత్తులు చేతివృత్తుదారులకు పనిముట్లు, మూడి సరుకులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఈ పథకం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నది. దీనిని వెబ్ సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.