Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!

Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!

మనసాక్షి , వెబ్ డెస్క్:

ఫోన్ పే దిగ్గజ కంపెనీ నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. ఆ కంపెనీలో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫోన్ పే కంపెనీలో బిజినెస్ డెవలప్ మెంట్ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు.

 

దీనికి ఏదైనా డిగ్రీ , బి.ఈ, బీటెక్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చును. ఎలాంటి అనుభవం అవసరం లేదు. దరఖాస్తు కేవలం ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి పరీక్షలు ఉండవు. కేవలం ఒక ఇంటర్వ్యూ తోనే జాబ్ కు ఎంపిక చేస్తారు.

 

ఎంపికైన వారికి మూడు నెలల పాటు ట్రైనింగ్ కూడా ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు 35 వేల రూపాయల వేతనం చెల్లిస్తారు.

 

ఉద్యోగానికి అర్హత :

ఏదైనా డిగ్రీ ,బిఇ , బిటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అనుభవం కూడా అవసరం లేదు.

 

దరఖాస్తు విదానం :

ఈ ఉద్యోగ ఖాళీలకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ లో కంపెనీ వెబ్ సైట్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు వారంలో ఐదు రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. రెండు రోజులు సెలవు ఉంటుంది.

 

వేతనం :

ఎంపికైన వారికి మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు . శిక్షణ సమయంలో నెలకు 35 వేల రూపాయల వేతనం చెల్లిస్తార శిక్షణ పూర్తయ్యాక నెలకు 50 వేల రూపాయల వేతనం చెల్లిస్తారు.

 

జాబ్ రోల్ :

ఫోన్ పే కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ విభాగంలో పనిచేయాల్సి ఉంటుంది. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు.

 

జాబ్ చేయాల్సిన నగరం :

 

ఫోన్ పే లో ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు ప్రస్తుతం బెంగళూరు బ్రాంచ్ లో పనిచేయాల్సి ఉంటుంది. బెంగళూరు లొకేషన్ లో ఒక సంవత్సరం పాటు పనిచేయాలి. ఆ తర్వాత దేశంలో ఫోన్ పే బ్రాంచ్ లలో ఎక్కడికైనా ట్రాన్స్ ఫర్ పెట్టుకునే అవకాశం ఉంది.

 

ఎక్కువమంది చదివిన న్యూస్… మీరు కూడా చదవడానికి క్లిక్ చేయండి 👇

1. Rythu Bandhu : రైతు బంధు కోసం .. ఆ రైతులు ఇలా చేయాలి..!

2. RBI : రూ. 500 నోట్లపై ఆర్ బీ ఐ కీలక ప్రకటన..!

3. ATM CARD | ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా .. బ్యాంకు కొత్త సర్వీస్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!

4. Upi Payments | ప్రతిరోజు ఎక్కువ సార్లు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

5. Phone pe : ఫోన్ పే కీలక మార్పులు.. వాడేవారంతా తెలుసుకోవాల్సిందే..!