Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంజిల్లా వార్తలుతెలంగాణ

Upi Payments | ప్రతిరోజు ఎక్కువ సార్లు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

Upi Payments | ప్రతిరోజు ఎక్కువ సార్లు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

మనసాక్షి , వెబ్ డిస్క్:

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. రోజువారీగా ఎక్కడికి వెళ్లినా.. ఏమి కొనుగోలు చేసినా… యూపీఐ ద్వారానే చెల్లింపులు కొనసాగిస్తున్నారు. అలాంటివారు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సి ఉంది.

 

యూపీఐ పేమెంట్స్ ఆయా బ్యాంకులలో లావాదేవీల పరిమితులను తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది. మనం చేసే పేమెంట్స్ ఏ బ్యాంకుకు సంబంధించి ఉందో .? దాని పరిమితి ఎంతో.? తెలుసుకొని ఉంటే యూపీఐ పేమెంట్స్ చేయడం పై జాగ్రత్తలు పాటించవచ్చును.

 

హెచ్ డి ఎఫ్ సి (HDFC), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఐ సి ఐ సి ఐ (ICICI) లాంటి బ్యాంకులు యూపీఐ లావాదేవీల పై పరిమితులు విధించాయి. ఏ బ్యాంకులో పరిమితి ఎంత అనే విషయం తెలుసుకుందాం….

 

యూపీఐ ద్వారా ఎంతవరకు ట్రాన్స్ ఫర్ చేయవచ్చును :

 

యూపీఐ ద్వారా గరిష్టంగా 25 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు ట్రాన్స్ఫర్ చేయవచ్చును. ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిబంధనలు విధించింది. కాగా ఆయా బ్యాంకులలో యూపీఐ పరిమితిని విధించాయి.

ఏ బ్యాంకులో ఎంత పరిమితి ఉందో తెలుసుకుందాం :

కెనరా బ్యాంక్ యూపీఐ ట్రాన్స్ ఫర్ గరిష్ట పరిమితి ప్రతిరోజు 25వేల రూపాయలుగా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా పరిమితి కూడా 25 వేల రూపాయలు గానే ఉంది. అతిపెద్ద బ్యాంక్ ఎస్ బీ ఐ (SBI) పరిమితి రోజుకు గరిష్టంగా ఒక లక్ష రూపాయలుగా ఉంది. హెచ్ డి ఎఫ్ సి (HDFC) బ్యాంకు పరిమితి ఒక లక్ష రూపాయలుగా ఉంది.

 

Also Read : Rythu Runa Mafi : రుణమాఫీ పై కేసీఆర్ కీలక ప్రకటన అప్పుడేనా..?

 

అయితే కొత్త యూజర్లకు మాత్రం ఈ పరిమితిని కేవలం 5000 రూపాయలు మాత్రమే రోజుకు ఉంటుంది. ఐసిఐసిఐ (ICICI) బ్యాంకు పరిమితి రోజుకు పదివేల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చును. యాక్సిస్ బ్యాంకు పరిమితి ఒక లక్ష రూపాయలుగా ఉంది.

 

కొన్ని బ్యాంకులు రోజువారి పరిమితి కాకుండా వారానికి కూడా పరిమితులు విధించాయి. ఐడిఎఫ్ సి (IDFC) బ్యాంకు యూపీఐ పరిమితిని వారానికి ఒక లక్ష రూపాయలుగా నెలకు 30 లక్షల రూపాయలుగా ఉంది.

ఎన్నిసార్లు యూపీఐ ట్రాన్స్ ఫర్ చేయవచ్చును :

 

యూపీఐ ట్రాన్స్ ఫర్ చేసేవారు చిన్నాచితక వాటికి అన్నిటికి కూడా UPI ని ఉపయోగిస్తున్నారు. ఇలాంటివారు ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది. UPI నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 20 సార్లు యూపీఐ ట్రాన్స్ ఫర్ చేయవచ్చును. ఆ తర్వాత కొత్తగా 24 గంటల పాటు ఎదురు చూడాల్సి ఉంది. అయితే ఈ పరిమితిని కూడా బ్యాంకులను బట్టి వివిధ రకాలుగా ఉంది.

 

Also Read : Good News : వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సహాయం.. ! దరఖాస్తు చేసుకోండిలా…!

 

యూపీఐ పరిమితి గూగుల్ పే, పేటీఎం అమెజాన్ పే పేమెంట్స్ వ యాప్స్ రోజుకు ఒక లక్ష రూపాయల పరిమితినిగా నిర్ణయించాయి. యూపీఐ యాప్స్ బ్యాంక్ అకౌంట్లకు రోజువారి లావాదేవీల సంఖ్య 10 గా ఉంది.

 

గూగుల్ పే వినియోగదారుడు ఎవరైనా రూ. 2000 మనీ రిక్వెస్ట్ పెడితే డైలీ ట్రాన్సాక్షన్స్ లిమిట్ ను ఈ యాప్ నిలిపి వేస్తుంది. అమెజాన్ యూపీఐ పే కొత్త వినియోగదారులకు మొదటి 24 గంటల పాటు 5000 రూపాయల వరకు పరిమితిగా నిర్ణయించింది.

 

Also Read : Mahesh Babu : మహేష్ బాబు కొత్త సినిమా లో మాస్ లుక్.. వేసుకున్న షర్ట్ ఖరీదు ఎంతో తెలుసా..?

మరిన్ని వార్తలు