ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడి అరెస్ట్..!
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అనంతరం పెళ్లికి నిరాకరించి వేధించాడనే ఆరోపణలతో ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడిని కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు.

ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడి అరెస్ట్..!
కరీంనగర్ బ్యూరో – నరేష్, మనసాక్షి :
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అనంతరం పెళ్లికి నిరాకరించి వేధించాడనే ఆరోపణలతో ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడిని కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన దక్కలి చంద్రకళ (30) శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీకి చెందిన గజ్జల హరికృష్ణతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శారీరకంగా దగ్గరయ్యాడని, తర్వాత పెళ్లికి నిరాకరించి మానసికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం హాస్టల్ గదిలో ఉరివేసుకుని చంద్రకళ ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హరికృష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తు కొనసాగుతోందని కొత్తపల్లి ఎస్‌హెచ్‌వో బిల్లా కోటేశ్వర్ తెలిపారు.









